
సౌరవ్ గంగూలీ (ఫైల్ ఫోటో)
కోల్‌కతా : ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. సినీ, క్రీడా ప్రముఖ వ్యక్తుల జీవితకథ ఆధారంగా సినిమాలను వరుసగా వచ్చేస్తున్నాయి. తమ ఆరాధ్య హీరోల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితకథల ఆధారంగా తెరకెక్కిన సినిమా అటు అభిమానులను, ఇటు బాక్సాఫీస్‌ను అలరించిన విషయం తెలిసిందే. త్వరలో మరో బయోపిక్‌కు రంగం సిద్ధమైంది.
టీమిండియా మాజీ సారథి, దాదా సౌరవ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. సౌరవ్ గంగూలీ ఆటో బయోగ్రఫీ ‘ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలీ ఫిలింస్‌పై ఏక్తాకపూర్ ఈ ప్రాజెక్టును నిర్మించబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఏక్తా.. దాదాని కలిసి స్టోరీ డిస్కషన్లు చేసినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే గంగూలీ కెరీర్‌తోపాటు.. మరుపురాని ఘట్టాలు ప్రేక్షకుల ముందు కనువిందు చేసే అవకాశం ఉంది. ఇక గంగూలీ పాత్రను పోషించబోయే నటుడెవరన్న చర్చ ఫ్యాన్స్‌లో మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment