India Vs England ODI Series 2022: మొదటి వన్డేలో గెలుపుతో జోష్ మీదున్న టీమిండియా ఇంగ్లండ్‌తో రెండో మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా గురువారం(జూలై 14) తలపడనుంది. ఓవల్ వన్డేలో ఏకపక్ష విజయంతో సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచిన రోహిత్ సేన సిరీస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
ఇక సొంతగడ్డపై తొలిసారి 10 వికెట్ల తేడాతో ఓడి చెత్త రికార్డు మూటగట్టుకున్న బట్లర్ బృందం ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది.
A bad day at the office as Bumrah and Sharma dominate 🏏
— England Cricket (@englandcricket) July 13, 2022
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/kw2ZrlOVFH
ఈ క్రమంలో ఇంగ్లండ్- టీమిండియా మధ్య పోరు మరింత రసవత్తరంగా మారనుంది. మరి పిచ్, వాతావరణం, తుది జట్ల అంచనా, మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, ఇతర వివరాలు పరిశీలిద్దాం.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో వన్డే
వేదిక: లార్డ్స్, లండన్
సమయం: భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఆరంభం
చానెల్: సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
పిచ్, వాతావరణం
చక్కటి బ్యాటింగ్ పిచ్. భారీ స్కోరుకు అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షం సమస్య లేదు. టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు.
తుది జట్ల అంచనా:
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, యజువేంద్ర చహల్.
ఇంగ్లండ్:
జోస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్స్, రీస్ టోప్లే, క్రెయిగ్ ఒవర్టన్/స్యామ్ కరన్.
మీకు తెలుసా?
2020 తర్వాత ఆసియేతర దేశాల్లో ఆడిన మూడు వన్డే సిరీస్‌లను టీమిండియా కోల్పోయింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేతిలో పరాభవాలు చవిచూసింది. ఇంగ్లండ్‌తో తాజా రెండో వన్డేలో గనుక గెలిస్తే సుమారు రెండేళ్ల తర్వాత విదేశీ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన భారత జట్టుగా రోహిత్ సేన నిలుస్తుంది. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే జూలై 17న జరుగనుంది.
చదవండి: Ravichandran Ashwin: అదే జరిగితే వన్డేల అస్తిత్వం ప్రమాదంలో పడ్డట్లే!
ICC World Cup Super League: వన్డే సిరీస్ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్! ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా?
Comments
Please login to add a commentAdd a comment