ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. ఆసీస్ బౌలర్ బెహ్రాన్‌డార్ఫ్ వేసిన 42వ ఓవర్ రెండో బంతిని క్రిస్ వోక్స్ డీప్ మిడ్‌వికెట్ వైపు భారీ షాట్ ఆడాడు. వోక్స్‌తో సహా అందరూ అది సిక్సర్ అని ఫిక్స్ అయ్యారు. కానీ అక్కడ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మ్యాక్స్‌వెల్ సిక్సర్ వెళ్లే బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్నాడు.