![Woakes Knocks Over Shubman Gill With An Unplayable Delivery - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/29/Shubhman-Gill.jpg.webp?itok=M80wmepo)
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ ఓ అద్బుతమైన బంతితో గిల్‌ను బోల్తా కొట్టించాడు.
వోక్స్ వేసిన లెంగ్త్ బాల్‌ను గిల్ స్ట్రైట్ డ్రైవ్ కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో ఒక్కసారిగా గిల్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. బ్యాటింగ్‌కు మొదల పెట్టిన టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. గిల్ 9 పరుగులు చేసి ఔట్ కాగా.. కోహ్లి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
చదవండి: ప్రపంచ క్రికెట్‌లో నా ఫేవరేట్ ప్లేయర్స్ వారే: బాబర్ ఆజం
Comments
Please login to add a commentAdd a comment