లార్డ్స్ వేదికగా జూన్1నుంచి ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టు కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ టెస్టుకు ఆ జట్టు స్టార్ పేసర్లు క్రిస్‌వోక్స్,, మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్ ఫిట్‌నెస్ కారణంగా దూరమయారు. ఈ క్రమంలో పేసర్ జోష్ టంగ్ ఇంగ్లండ్ తరపున టెస్టు అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు.
కాగా ఈ టెస్టుకు తొలుత 15 మంది సభ్యులతో కూడిన ప్రకటించిన జట్టులో జోష్ టంగ్ చోటుదక్కలేదు. కానీ ఈ నలుగురు పేసర్లు ఈ టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో.. ఆఖరి నిమిషంలో జోష్ టంగ్‌కు చోటుదక్కింది. కౌంటీల్లో వోర్సెస్టర్‌షైర్ తరపున అద్భుతంగా రాణించడంతో టంగ్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 82 ఇన్నింగ్స్‌లలో 162 వికెట్లు పడగొట్టాడు ఈ వోర్సెస్టర్‌షైర్ పేసర్. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టెస్టుతో వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో పనరాగమనం చేయనున్నాడు. కాలి గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి బెయిర్‌స్టో జట్టుకు దూరంగా ఉన్నసంగతి తెలిసిందే.
ఐర్లాండ్‌తో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్, జాక్ లీచ్
చదవండి: WTC final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్!
Comments
Please login to add a commentAdd a comment