Eng Vs NZ: స్టోక్స్‌ విధ్వంసం.. చిత్తుగా ఓడిన న్యూజిలాండ్‌.. ఏకంగా.. | ENG Vs NZ: Stokes Record Century England To 181 Run Win Over New Zealand | Sakshi
Sakshi News home page

Ben Stokes: బెన్‌ స్టోక్స్‌ విధ్వంసం.. చిత్తుగా ఓడిన న్యూజిలాండ్‌.. ఏకంగా..

Published Thu, Sep 14 2023 8:32 AM | Last Updated on Thu, Sep 14 2023 9:17 AM

ENG Vs NZ: Stokes Record Century England To 181 Run Win Over New Zealand - Sakshi

England vs New Zealand, 3rd ODI- లండన్‌: న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (124 బంతుల్లో 182; 15 ఫోర్లు, 9 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన స్టోక్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ మలాన్‌ (96; 12 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి మూడో వికెట్‌కు 199 పరుగులు జోడించాడు.

368 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌
డబుల్‌ సెంచరీ దిశగా సాగుతున్న దశలో స్టోక్స్‌ 45వ ఓవర్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. స్టోక్స్‌ అవుటయ్యాక ఇంగ్లండ్‌ 48.1 ఓవర్లలో 368 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి 187 పరుగులకే కుప్పకూలింది.

ఫిలిప్స్‌ 72 పరుగులతో రాణించినా
దీంతో.. ఆతిథ్య జట్టు విధించిన టార్గెట్‌ను ఛేదించే క్రమంలో గ్లెన్‌ ఫిలిప్స్‌(72) ఒంటరి పోరాటం వృథాగా పోయింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌.. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ మూడేసి వికెట్లు తీయగా.. రీస్‌ టోప్లే రెండు వికెట్లతో రాణించాడు.

అదే విధంగా సామ్‌ కరన్‌, మొయిన్‌ అలీ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మేరకు ఓవల్‌ మైదానంలో 181 పరుగుల తేడాతో భారీ గెలుపు అందుకున్న ఇంగ్లండ్‌ నాలుగు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో  2-1తో ఆధిక్యంలో నిలిచింది.

వన్డేల్లో ఇంగ్లండ్‌ ముందంజ
కాగా నాలుగు టీ20, నాలుగు వన్డేలు ఆడే నిమిత్తం న్యూజిలాండ్‌ ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఇరు జట్లు చెరో రెండు విజయాలు నమోదు చేయగా టీ20 సిరీస్‌ డ్రాగా ముగిసింది.

ఇక తొలి వన్డేలో పర్యాటక కివీస్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందగా.. ఇంగ్లండ్‌ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఇదిలా ఉంటే... గత ఏడాది జూలైలో వన్డేలకు వీడ్కోలు పలికిన స్టోక్స్‌ ప్రపంచకప్‌ కోసం తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. 

చదవండి: ‘టీమిండియా మ్యాచ్‌ ఫిక్స్‌ చేశారు’.. మండిపడ్డ అక్తర్‌! మనోళ్లకు చేతకాదు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement