క్రికెట్‌లో విశ్లేషణ ఈరోజుల్లో కామన్‌గా మారిపోయింది. మ్యాచ్‌కు ముందు ఎవరు జట్టులో ఉంటే బాగుంటుంది.. బౌలింగ్, బ్యాటింగ్ కాంబినేషన్ ఏంటి.. జట్టు కూర్పు ఎలా ఉండాలి.. తొలుత బ్యాటింగ్ చేస్తే మంచిదా లేక బౌలింగ్ చేయాలాఅనే దానిపై క్రీడా పండితులు ఎవరికి తోచినట్లుగా వారు విశ్లేషిస్తారు. మ్యాచ్ పూర్తైన తర్వాత కూడా వీరి విశ్లేషణలు ఉంటాయి. కొన్నిసార్లు వాళ్లు చెప్పిన విషయాలు నిజమవ్వొచ్చు.. మరికొన్నిసార్లు విఫలం కావొచ్చు. ఇక మ్యాచ్ సమయంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌కు ప్రత్యర్థి జట్టులో ఉన్న బౌలర్లలో ఎవరు బౌలింగ్ బాగా వేయగలరు అనేది అనలిస్టులు ఊహించడం చూస్తుంటాం.
తాజాగా టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా ఒక అనలిస్ట్ చేసిన విశ్లేషణ పూర్తిగా రివర్స్ అయింది. అదేంటంటే.. కివీస్ బ్యాటర్లలో డెవన్ కాన్వే మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. అతనికి బౌలింగ్‌లో ఎవరు గుడ్ ఆప్షన్ .. బ్యాడ్ ఆప్షన్ అనే విషయంపై ఒక క్రీడా అనలిస్టు స్పందించాడు. గుడ్ ఆప్షన్ కింద మొయిన్ అలీ, మార్క్ వుడ్‌లను ఎంచుకున్న సదరు అనలిస్ట్ బ్యాడ్ ఆప్షన్ కింద క్రిస్ వోక్స్‌ను ఎంచుకున్నాడు.
ఇక్కడే అంచనాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. ఏ బౌలర్ అయితే కాన్వేకు బ్యాడ్ ఆప్షన్ అన్నాడో అతనో వికెట్ తీయడం విశేషం. వోక్స్ తాను వేసిన తొలి ఓవర్లోనే చివరి బంతికి కాన్వేను ఔట్ చేశాడు. వోక్స్ వేసిన బంతి బ్యాట్‌ను తాకి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకోగా కీపర్ బట్లర్ సూపర్‌గా డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో మూడు పరుగుల వద్ద కాన్వేను వెనక్కి పంపిన వోక్స్ ఇంగ్లండ్‌కు బ్రేక్ అందించాడు.
ఇది చూసిన అభిమానులు.. అంచనాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. మనం అనుకున్నవన్నీ రివర్స్ అవడం అంటే ఇదే. బ్యాడ్ ఆప్షన్ అని ఎంచుకున్న వోక్స్ ఇవాళ కాన్వే వికెట్ తీశాడు. మీ అంచనాలు తప్పాయి అంటూ కామెంట్స్ చేశారు.
A #statswank story in 2 parts…. #T20WorldCup #engvnz pic.twitter.com/wzc9jWeyzl
— Innocent Bystander (@InnoBystander) November 1, 2022
చదవండి: కేన్ మామ ఇలా చేస్తావని ఊహించలేదు..
ఇంగ్లండ్ తరపున తొలి బ్యాటర్‌గా జాస్ బట్లర్
Comments
Please login to add a commentAdd a comment