
టి20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఇంగ్లండ్‌కు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఇంగ్లండ్‌కు సెమీస్ అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ జాస్ బట్లర్ 73 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు అలెక్స్ హేల్స్ 52 పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో జాస్ బట్లర్ ఇంగ్లండ్ తరపున టి20ల్లో అరుదైన ఘనత సాధించాడు.
టి20ల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో బట్లర్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. కివీస్‌తో మ్యాచ్‌లో బట్లర్ 64 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇయాన్ మోర్గాన్(2458 పరుగులు)ను అధిగమించాడు. ఓవరాల్‌గా 73 పరుగులు చేసిన బట్లర్ 2467 పరుగులతో టాప్ స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఇయాన్ మోర్గాన్(2458 పరుగులు) రెండో స్థానంలో ఉండగా.. అలెక్స్ హేల్స్(1940 పరుగులు) మూడో స్థానంలో, డేవిడ్ మలాన్(1745 పరుగులు) నాలుగో స్థానంలో ఉన్నాడు.