కాన్వే అరుదైన ఘనత.. బాబర్‌తో కలిసి సంయుక్తంగా | Devon Conway 2nd Fastest Batter Reach 1000 Runs Marks-26 Innings T20s | Sakshi
Sakshi News home page

Devon Conway: కాన్వే అరుదైన ఘనత.. బాబర్‌తో కలిసి సంయుక్తంగా

Published Sat, Oct 22 2022 2:10 PM | Last Updated on Sat, Oct 22 2022 2:12 PM

Devon Conway 2nd Fastest Batter Reach 1000 Runs Marks-26 Innings T20s - Sakshi

న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డెవన్‌ కాన్వే టి20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. టి20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా బాబర్‌ ఆజంతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-12లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కాన్వే ఈ ఫీట్‌ సాధించాడు. మ్యాచ్‌లో 59 పరుగుల వద్ద ఆడుతున్నప్పుడు వెయ్యి పరుగుల మార్క్‌ను క్రాస్‌ చేశాడు.

కాగా కాన్వేకు వెయ్యి పరుగుల మైలురాయిని అందుకునేందుకు 26 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. బాబర్‌ ఆజం కూడా 26 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును అందుకున్నాడు. వీరిద్దరి కంటే ముందు ఇంగ్లండ్‌ స్టార్‌ డేవిడ్‌ మలాన్‌ 24 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగుల మార్క్‌ను అందుకొని తొలి స్థానంలో ఉన్నాడు.

చదవండి: IND Vs PAK: అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఆ భయాలేమి అక్కర్లేదట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement