![Jasprit Bumrah is best allformat bowler in the world, says Chris Woakes - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/22/jas.jpg.webp?itok=seqntl9O)
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ వోక్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అని వోక్స్ కొనియాడాడు. కాగా గాయం కారణంగా దాదాపు ఏడాది తర్వాత జట్టులో ఎంట్రీ ఇచ్చిన బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆసియాకప్‌ను భారత్ సొంతం చేసుకోవడంలో బుమ్రా తన వంతు పాత్ర పోషించాడు.
"వరల్డ్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో జస్ప్రీత్ బుమ్రా మొదటి స్ధానంలో ఉంటాడు. అతడి బౌలింగ్ స్టైల్ అద్బుతం. చాలా భిన్నంగా ఉంటుంది. బుమ్రా బౌలింగ్‌ను బ్యాటర్లు అర్దం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అతడు ఎక్కువ పేస్‌తో బౌలింగ్ చేయగలడు.
అదే విధంగా స్లోయర్ బాల్స్ కూడా అద్బుతంగా వేయగలడు. యార్కర్లకు కూడా సంధించగలడు. ఒక వైట్ బాల్ బౌలర్‌కు ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ బుమ్రాకు ఉన్నాయి అంటూ విజ్డెన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్ వోక్స్ పేర్కొన్నాడు. బుమ్రా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో బీజీగా ఉన్నాడు.
చదవండి: World Cup 2023: వరల్డ్ కప్‌కు జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. ఎవరూ ఊహించని ఆటగాళ్లు ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment