వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా తమ అఖరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ఆదివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో డచ్ జట్టును చిత్తు చేసి రెట్టింపు ఆత్మవిశ్వాసంతో సెమీఫైనల్ బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తోంది. డచ్‌తో మ్యాచ్ కోసం నెట్స్‌లో రోహిత్ సేన తీవ్రంగా శ్రమించింది.
టీ20 తరహా నెట్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. ఒక వేళ భారత్ మొదట బ్యాటింగ్ చేస్తే పరుగులు వరద పారడం ఖాయం. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో స్టార్‌పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతి ఇవ్వాలని జట్టు మేనెజ్‌మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం.
బుమ్రా స్ధానంలో యువ పేసర్, లోకల్ బాయ్ ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ ప్లేస్‌లో వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ రానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా గాయం కారణంగా టోర్నీ మధ్యలో తప్పుకున్న హార్దిక్ పాండ్యా స్ధానంలో ప్రసిద్ద్ జట్టులోకి వచ్చాడు.
భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, షమీ, అశ్విన్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ
చదవండి: మిచెల్ మార్ష్ వీరవిహారం
Comments
Please login to add a commentAdd a comment