SL vs IRE, 1st Test: Jayasuriya bags 5 wickets after Sri Lanka declared on 591-6 - Sakshi
Sakshi News home page

SL Vs IRE: చండీమల్, సమరవిక్రమ సెంచరీలు.. ఐదు వికెట్లతో చెలరేగిన జయసూర్య

Published Tue, Apr 18 2023 8:31 AM | Last Updated on Tue, Apr 18 2023 11:11 AM

SL Vs IRE 1st Test: Jayasuriya 5 Wickets Sri Lanka Declared On 591 - Sakshi

Sri Lanka vs Ireland, 1st Test- గాలె: ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుపై శ్రీలంక రెండో రోజే పట్టు బిగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 386/4తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక 6 వికెట్లకు 591 పరుగులవద్ద డిక్లేర్‌ చేసింది. దినేశ్‌ చండీమల్‌ (102 నాటౌట్‌; 12 ఫోర్లు), సమరవిక్రమ (104 నాటౌట్‌; 11 ఫోర్లు) అజేయ సెంచరీలు సాధించారు.

వీరిద్దరు ఏడో వికెట్‌కు 183 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఐర్లాండ్‌ ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి కష్టాల్లో పడింది. జేమ్స్‌ మెకొల్లమ్‌ (35; 5 ఫోర్లు), హ్యారీ టెక్టర్‌ (34; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

టకెర్‌ (21 బ్యాటింగ్‌), మెక్‌బ్రైన్‌ (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. లంక బౌలర్లలో ప్రభాత జయసూర్య 5 వికెట్లు, ఫెర్నాండో 2 వికెట్లు  పడగొట్టారు. లంక స్కోరుకు ఐర్లాండ్‌ మరో 474 పరుగులు వెనుకబడి ఉంది.   
చదవండి: దురదృష్టం అంటే కోహ్లిదే.. అయ్యో విరాట్‌! బౌలర్‌కు మాత్రం!వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement