పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు పడగొట్టడం ద్వారా లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ కెరీర్‌లో తొలి మూడు మ్యాచ్‌ల తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో భారత మాజీ లెగ్ స్పిన్ బౌలర్ నరేంద్ర హిర్వాని (31 వికెట్లు, తొలి టెస్ట్‌లోనే విండీస్‌పై 16 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ప్రభాత్ (29) ఆస్ట్రేలియా మాజీ బౌలర్ చార్లెస్ టర్నర్ (29)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.
Most wickets after three Tests in career:
— Lalith Kalidas (@lal__kal) July 28, 2022
31 - Narendra Hirwani (Ind)
29 - PRABATH JAYASURIYA* (SL)
29 - Charles Turner (Aus)
27- Axar Patel (Ind)
27 - Rodney Hogg (Aus)#SLvsPAK pic.twitter.com/tubvpRY9mF
ఈ క్రమంలో ప్రభాత్.. టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ (27) రికార్డును కూడా అధిగమించాడు. పాక్‌తో రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రభాత్.. మరో రికార్డను కూడా సంయుక్తంగా షేర్ చేసుకున్నాడు. తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు 5 వికెట్ల ఘనతలు సాధించిన బౌలర్‌గా అక్షర్ పటేల్‌తో సమంగా నిలిచాడు.
4th 5 wicket haul in 6 innings for Prabath Jayasuriya. Amazing performance so far.
— Gurkirat Singh Gill (@gurkiratsgill) July 28, 2022
Very similar to how Axar Patel started out for India. He too had 4 5-wkt hauls in his first 6 innings.
అరంగేట్రం టెస్ట్‌లో 12 వికెట్లు (6/118, 6/59) నేలకూల్చి లంక తరఫున డెబ్యూ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పిన ప్రభాత్.. ఆ తర్వాత పాక్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 9 వికెట్లు (5/82, 4/135), తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు (3/80, 5/117) సాధించాడు. ఆడిన 3 మ్యాచ్‌ల్లో తన జట్టును రెండు సార్లు గెలిపించిన ప్రభాత్.. ప్రస్తుత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ బ్యాటర్లందరినీ (రూట్ మినహా) ఔట్ చేశాడు.
Sri Lanka's Prabath Jayasuriya has now dismissed:
— Haseeb Khan 🇵🇰 (@HaseebkhanHk7) July 28, 2022
No. 2 ranked Test Batter Marnus Labuschagne, twice.
No.3 ranked Test Batter Babar Azam twice, that too in his first 5 bowling inns.
No. 4 ranked Test Batter Steve Smith, once. (for a duck)
#SLvPAK #GalleTest #BabarAzam pic.twitter.com/z5kQYinLtg
వరల్డ్ నంబర్ 2 బ్యాటర్ లబూషేన్‌ను రెండుసార్లు, నంబర్ 3 ఆటగాడు బాబర్ ఆజమ్‌ను రెండుసార్లు, స్టీవ్ స్మిత్‌ను ఒక్కసారి (డకౌట్) పెవిలియన్‌కు పంపాడు. 30 ఏళ్ల లేటు వయసులో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్.. తన వైవిధ్యమైన స్పిన్ మాయాజాలంతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ప్రత్యర్ధుల పాలిట సింహస్వప్నంలా మారాడు. వికెట్లు సాధించడంతో పాటు జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషిస్తూ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో నయా సెన్సేషన్‌గా మారాడు.
Prabath Jayasuriya in Test cricket:
— Johns. (@CricCrazyJohns) July 28, 2022
6 for 118 vs Australia.
6 for 59 vs Australia.
5 for 82 vs Pakistan.
4 for 135 vs Pakistan.
3 for 80 vs Pakistan.
5 for 117 vs Pakistan. pic.twitter.com/KcZjHP4lRn
చదవండి: రెచ్చిపోయిన స్పిన్నర్లు.. పాక్‌ను మట్టికరిపించిన లంకేయులు
Comments
Please login to add a commentAdd a comment