Sri lanka bowler
-
IPL 2023: నేనున్నాను.. నేను చూసుకుంటాను అంటూ భరోసా ఇచ్చిన ధోని
ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన యువ పేసర్, జూనియర్ మలింగగా పిలువబడే శ్రీలంక చిన్నోడు మతీష పతిరణకు, అతని కుటుంబానికి జట్టు సారధి మహేంద్ర సింగ్ ధోని భరోసా ఇచ్చాడు. గురువారం (మే 25) పతిరణ, అతని కుటుంబ సభ్యులు చెన్నైలో ధోనిని కలిసిన సందర్భంగా ఈ హామీ ఇచ్చాడు. ఈ విషయాన్ని పతిరణ సోదరి, ధోనికి వీరాభిమాని అయిన విషుక పతిరణ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. మల్లి (పతిరణను కుటుంబ సభ్యులు ముద్దుగా పిలుచుకునే పేరు) సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నాడని ఆమె కామెంట్ చేసింది. ధోనిని కలిసిన క్షణాలు నేను కలలుగన్న దానికి మించి ఉన్నాయని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. కాగా, పతిరణ అతని కుటుంబ సభ్యులు ధోనిని చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్లో కలిసారు. ఈ సందర్భంగా పతిరణ తన కుటుంబ సభ్యులను ధోనికి పరిచయం చేశాడు. ఐపీఎల్ కోసం పతిరణ (20) కుటుంబాన్ని వదిలి భారత్‌లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు గమనించిన ధోని వారికి భరోసా ఇచ్చాడు. పతిరణ గురించి మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతనెప్పుడూ నాతోనే ఉంటాడు. నేను చూసుకుంటాను అంటూ ధైర్యం చెప్పాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సీఎస్కే ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. మే 28న జరిగే ఫైనల్లో ధోని సేన.. గుజరాత్ వర్సెస్‌ముంబై మ్యాచ్ (క్వాలిఫయర్ 2) విజేతతో తలపడుతుంది. ఫైనల్లో సీఎస్కే గెలిస్తే ముంబైతో సమానంగా ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన జట్టుగా చరిత్రలో నిలుస్తుంది. రికార్డు స్థాయిలో 10వ సారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరిన ధోని అండ్ కో ఫైనల్లో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. ధోనికి ఇది చివరి సీజన్ అని ప్రచారం జరుగుతుండటంతో కోట్లాది మంది అభిమానులు ఆసారి సీఎస్కేనే టైటిల్ గెలవాలని కోరుకుంటున్నారు. చదవండి: కేఎస్ భరతా.. ఇషాన్ కిషనా..? డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్‌కీపర్ ఎవరు..? -
శ్రీలంకకు భారీ షాక్.. యువ బౌలర్ దూరం
టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ పేసర్ దిల్షాన్ మధుశంక గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు ట్రైనింగ్‌లో సెషన్లో మధుశంక మెకాలికి గాయమైంది. దీంతో అతడిని ఎమ్మరై స్కాన్‌కు తరలించగా.. గాయం తీవ్రమైనదిగా తేలింది. ఈ క్రమంలోనే టోర్నీ మొత్తానికి మధుశంక దూరమయ్యాడు. అదే విధంగా త్వరలోనే అతడి స్థానాన్ని శ్రీలంక క్రికెట్ భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే రిజర్వ్ జాబితా ఉన్న బినూర ఫెర్నాండో ప్రధాన జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్‌లో గీలాంగ్ వేదికగా నమీబియాతో శ్రీలంక తలపడుతోంది. చదవండి: Women's Asia Cup 2022: శ్రీలంకపై అద్భుత విజయం.. అమ్మాయిల సెలబ్రేషన్స్ మామాలుగా లేవుగా -
అక్షర్ పటేల్ రికార్డు బద్దలు కొట్టి.. నరేంద్ర హిర్వానికి చేరువై..!
పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు పడగొట్టడం ద్వారా లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ కెరీర్లో తొలి మూడు మ్యాచ్‌ల తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో భారత మాజీ లెగ్ స్పిన్ బౌలర్ నరేంద్ర హిర్వాని (31 వికెట్లు, తొలి టెస్ట్‌లోనే విండీస్‌పై 16 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ప్రభాత్ (29) ఆస్ట్రేలియా మాజీ బౌలర్ చార్లెస్ టర్నర్ (29)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. Most wickets after three Tests in career:31 - Narendra Hirwani (Ind)29 - PRABATH JAYASURIYA* (SL)29 - Charles Turner (Aus)27- Axar Patel (Ind)27 - Rodney Hogg (Aus)#SLvsPAK pic.twitter.com/tubvpRY9mF— Lalith Kalidas (@lal__kal) July 28, 2022 ఈ క్రమంలో ప్రభాత్.. టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ (27) రికార్డును కూడా అధిగమించాడు. పాక్‌తో రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రభాత్.. మరో రికార్డను కూడా సంయుక్తంగా షేర్ చేసుకున్నాడు. తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు 5 వికెట్ల ఘనతలు సాధించిన బౌలర్‌గా అక్షర్ పటేల్‌తో సమంగా నిలిచాడు. 4th 5 wicket haul in 6 innings for Prabath Jayasuriya. Amazing performance so far.Very similar to how Axar Patel started out for India. He too had 4 5-wkt hauls in his first 6 innings.— Gurkirat Singh Gill (@gurkiratsgill) July 28, 2022 అరంగేట్రం టెస్ట్‌లో 12 వికెట్లు (6/118, 6/59) నేలకూల్చి లంక తరఫున డెబ్యూ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పిన ప్రభాత్.. ఆ తర్వాత పాక్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 9 వికెట్లు (5/82, 4/135), తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు (3/80, 5/117) సాధించాడు. ఆడిన 3 మ్యాచ్‌ల్లో తన జట్టును రెండు సార్లు గెలిపించిన ప్రభాత్.. ప్రస్తుత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ బ్యాటర్లందరినీ (రూట్ మినహా) ఔట్ చేశాడు. Sri Lanka's Prabath Jayasuriya has now dismissed:No. 2 ranked Test Batter Marnus Labuschagne, twice.No.3 ranked Test Batter Babar Azam twice, that too in his first 5 bowling inns. No. 4 ranked Test Batter Steve Smith, once. (for a duck) #SLvPAK #GalleTest #BabarAzam pic.twitter.com/z5kQYinLtg— Haseeb Khan 🇵🇰 (@HaseebkhanHk7) July 28, 2022 వరల్డ్ నంబర్ 2 బ్యాటర్ లబూషేన్‌ను రెండుసార్లు, నంబర్ 3 ఆటగాడు బాబర్ ఆజమ్‌ను రెండుసార్లు, స్టీవ్ స్మిత్‌ను ఒక్కసారి (డకౌట్) పెవిలియన్‌కు పంపాడు. 30 ఏళ్ల లేటు వయసులో సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్.. తన వైవిధ్యమైన స్పిన్ మాయాజాలంతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ప్రత్యర్ధుల పాలిట సింహస్వప్నంలా మారాడు. వికెట్లు సాధించడంతో పాటు జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషిస్తూ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో నయా సెన్సేషన్‌గా మారాడు. Prabath Jayasuriya in Test cricket:6 for 118 vs Australia.6 for 59 vs Australia.5 for 82 vs Pakistan.4 for 135 vs Pakistan.3 for 80 vs Pakistan.5 for 117 vs Pakistan. pic.twitter.com/KcZjHP4lRn— Johns. (@CricCrazyJohns) July 28, 2022 చదవండి: రెచ్చిపోయిన స్పిన్నర్లు.. పాక్‌ను మట్టికరిపించిన లంకేయులు -
టెస్ట్ క్రికెట్లో నయా సెన్సేషన్.. తొలి మూడు టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు..!
శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య టెస్ట్ క్రికెట్లో నయా సెన్సేషన్‌గా మారాడు. 30 ఏళ్ల లేటు వయసులో సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్.. తన వైవిధ్యమైన స్పిన్ మాయాజాలంతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ప్రత్యర్ధుల పాలిట సింహస్వప్నంలా మారాడు. ఇప్పటివరకు ఆడిన 3 టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు నేలకూల్చిన ప్రభాత్.. తన జట్టును రెండు పర్యాయాలు ఒంటిచేత్తో గెలిపించాడు. Prabath Jayasuriya in Test cricket: 6 for 118 vs Australia. 6 for 59 vs Australia. 5 for 82 vs Pakistan. 4 for 135 vs Pakistan. 3 for 80 vs Pakistan. 5 for 117 vs Pakistan. pic.twitter.com/KcZjHP4lRn — Johns. (@CricCrazyJohns) July 28, 2022 తాజాగా పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు (3/80, 5/117) పడగొట్టి.. తన జట్టుకు అపురూప విజయాన్నందించిన (246 పరుగుల భారీ తేడాతో ఘన విజయం) ప్రభాత్.. అంతకుముందు ఆసీస్ సిరీస్‌లో రెండో టెస్ట్‌నూ రెచ్చిపోయి (6/118, 6/59) ఆర్ధిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న తన దేశానికి ఊరట కలిగించే విజయాన్నందించాడు. ఈ ప్రదర్శనతో రాత్రికిరాత్రి హీరో అయిపోయిన ప్రభాత్.. ఆతర్వాత పాక్‌పై తొలి టెస్ట్‌లోనూ చెలరేగి 9 వికెట్లు (5/82, 4/135) సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (160 నాటౌట్) సూపర్ సెంచరీతో రెచ్చిపోవడంతో పాక్ 342 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు విజయం సాధించింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ శక్తి వంచన లేకుండా బౌలింగ్ చేసిన ప్రభాత్‌కు మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించకపోవడంతో లంక భారీ టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆసీస్, పాక్ లాంటి జట్లనే వణికించిన ఈ నయా స్పిన్ సెన్సేషన్.. మున్ముందు మరిన్ని రికార్డులను బద్దలుకొడతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: రెచ్చిపోయిన స్పిన్నర్లు.. పాక్‌ను మట్టికరిపించిన లంకేయులు -
ఆసీస్‌ను 'ఆరే'సిన జయసూర్య.. అరంగేట్రం మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన లంక స్పిన్నర్
Prabath Jayasuriya: గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో లంక లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అదరగొట్టాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆరు వికెట్ల ప్రదనర్శనతో రెచ్చిపోయాడు. ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను తన స్పిన్ మాయాజాలంతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఫలితంగా పర్యాటక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. జయసూర్య తన డెబ్యూ ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలో 118 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. Outstanding debut figures for Prabath Jayasuriya! 🙌#SLvAUS pic.twitter.com/Df4FcVsczk — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2022 ఓవర్‌నైట్ స్కోర్ 298/5 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. జయసూర్య మాయాజాలం ధాటికి మరో 66 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 5 వికెట్లు కోల్పోయింది. సెంచరీ హీరో స్టీవ్ స్మిత్ (145 నాటౌట్) ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 36 పరుగులు జోడించి అజేయంగా నిలువగా.. మిగిలిన ఆటగాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. లంక రెండో రోజు పడగొట్టిన 5 వికెట్లలో జయసూర్యకు 3 వికెట్లు దక్కాయి. లంక బౌలర్లలో జయసూర్య 6, రజిత 2, ఆర్ మెండిస్, తీక్షణ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక జట్టు లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. అంతకుముందు తొలి రోజు ఆటలో స్మిత్‌తో పాటు మార్నస్ లబుషేన్ (156 బంతుల్లో 104; 12 ఫోర్లు) సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరు మూడో వికెట్‌కు 134 పరుగులు జోడిండి ఆసీస్‌ను ఆదుకున్నారు. చదవండి: దినేశ్ కార్తీక్‌కు వింత అనుభవం.. తన డెబ్యూ మ్యాచ్‌లో ప్లేయర్ ఇప్పుడు..! -
నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు; ఇక ఎవరికి సాధ్యం
Lasit Malinga Retirement.. శ్రీలంక స్టార్ క్రికెటర్ లసిత్ మలింగ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. మలింగ సాధించిన రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ ఒక రికార్డు మాత్రం ఇప్పటివరకు పదిలంగానే ఉంది. అదే నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు.. అందునా ఒకే రికార్డును రెండుసార్లు సాధించడం ఒక్క మలింగకే చెల్లింది. మరి ఆ రికార్డు ఇక ఎవరికి సాధ్యమవుతుందో చూడాలి. ఇక మలింగ సాధించిన 'నాలుగు బంతుల్లో.. నాలుగు వికెట్ల' రికార్డును ఒకసారి పరిశీలిద్దాం. 2007 వన్డే ప్రపంచకప్ .. 2019లో మలింగ చదవండి: మలింగ తరహాలో అరుదైన ఫీట్.. అయినా ఓడిపోయారు 12 ఏళ్ల బంధానికి ముంబై ఇండియన్స్ గుడ్‌బై 2007 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ప్రొవిడెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 45వ ఓవర్ చివరి రెండు బంతుల్లో పొలాక్, హాల్‌లను అవుట్ చేసిన అతను, 47వ ఓవర్ తొలి రెండు బంతుల్లో కలిస్, ఎన్తినిలను పెవిలియన్ పంపించాడు. అలా నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మలింగ రికార్డును దాదాపు 12 ఏళ్ల పాటు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ మరోసారి అదే రిపీట్ చేశాడు. 2019లో పల్లెకెలెలో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 మ్యాచ్ మూడో ఓవర్లో మలింగ వరుసగా మున్రో, రూథర్‌ఫర్డ్, గ్రాండ్‌హోమ్, టేలర్‌లను అవుట్ చేయడం విశేషం. మలింగ ఇప్పటి వరకు 30 టెస్టులు, 226 వన్డేలు, 84 టి20లలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 101, వన్డేల్లో 338, టీ20లలో 107 వికెట్లు కలిపి మొత్తం 546 వికెట్లు తీసుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడి జాబితాలో ఇప్పటికీ అతడిదే పైచేయి. అంతేకాదు, పొట్టి ఫార్మాట్లో 100 వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ కూడా అతడే. చదవండి: Lasith Malinga: ఇకపై ఆ యార్కర్లు కనిపించవు 4️⃣ in 4️⃣ v SA, 2007 (ODI) 4️⃣ in 4️⃣ v NZ, 2019 (T20I) Lasith Malinga is the only bowler to have taken four wickets in four balls twice! On his birthday, relive his spell against South Africa at the 2007 @CricketWorldCup 📹 pic.twitter.com/ofPAI9YjPM — ICC (@ICC) August 28, 2020 -
మురళీధరన్‌గా విజయ్ సేతుపతి
చెన్నై: అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా సినిమా రూపొందనుంది. ఎంఎస్ శ్రీపతి దీనికి దర్శకత్వం వహించనుండగా...మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, దార్ మోషన్ పిక్చర్స్ దీనిని సంయుక్తంగా నిర్మిస్తాయి. ‘సైరా’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన విజయ్ సేతుపతి దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ పాత్రలో కనిపిస్తాడు. మురళీధరన్ టెస్టుల్లో తీసిన 800 వికెట్లను గుర్తు చేసే విధంగా సినిమా టైటిల్ కూడా ‘800’ అని పెట్టారు. వన్డేల్లో కూడా మురళీధరన్ 534 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నేడు జరిగే చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌కు ముందు ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభమవుతుంది. మురళీ బయోపిక్కు ప్రధానంగా తమిళంలో రూపొందించి ఇతర భారతీయ భాషలతో పాటు సింహళీస్లో కూడా అనువదిస్తారు. భారత్‌తో పాటు శ్రీలంక ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో సినిమాను షూట్ చేస్తారు. -
షనక మ్యాజిక్... శ్రీలంక విన్
డబ్లిన్: తొలి వన్డేలోనే శ్రీలంక బౌలర్ దాసన్ షనక సత్తా చాటాడు. అరంగ్రేటంలోనే 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్ లో మెరుపులు చూపించాడు. రెండు వన్డేల సిరీస్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో శ్రీలంక 76 పరుగులతో విజయం సాధించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. వికెట్ కీపర్ చందిమాల్ సెంచరీ సాధించాడు. 107 బంతుల్లో 6 ఫోర్లతో శతకం బాదాడు. మెండిస్ 51, మాథ్యూస్ 49 పరుగులు చేశారు. షనక వేగంగా ఆడి 19 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లలో 42 పరుగులు బాదాడు. వర్షం పడడంతో ఐర్లాండ్ కు 47 ఓవర్లలో 293 పరుగుల టార్గెట్ పెట్టారు. ఐర్లాండ్ 40.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. పోర్టర్ ఫీల్డ్(73), ఓబ్రీన్(64) అర్ధ సెంచరీలతో రాణించారు. డీ/ఎల్ ప్రకారం శ్రీలంక 76 పరుగులతో గెలిచినట్టు అంపైర్లు ప్రకటించారు. శ్రీలంక బౌలర్లలో 5 వికెట్లు పడగొట్టాడు. మాథ్యూస్ 2 వికెట్లు తీశాడు. వన్డేల్లో ఫస్ట్ మ్యాచ్ లోనే 5 వికెట్లు పడగొట్టిన 12వ బౌలర్ గా షనక గుర్తింపుపొందాడు.