షనక మ్యాజిక్... శ్రీలంక విన్
డబ్లిన్: తొలి వన్డేలోనే శ్రీలంక బౌలర్ దాసన్ షనక సత్తా చాటాడు. అరంగ్రేటంలోనే 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్ లో మెరుపులు చూపించాడు. రెండు వన్డేల సిరీస్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో శ్రీలంక 76 పరుగులతో విజయం సాధించింది.
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. వికెట్ కీపర్ చందిమాల్ సెంచరీ సాధించాడు. 107 బంతుల్లో 6 ఫోర్లతో శతకం బాదాడు. మెండిస్ 51, మాథ్యూస్ 49 పరుగులు చేశారు. షనక వేగంగా ఆడి 19 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లలో 42 పరుగులు బాదాడు. వర్షం పడడంతో ఐర్లాండ్ కు 47 ఓవర్లలో 293 పరుగుల టార్గెట్ పెట్టారు.
ఐర్లాండ్ 40.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. పోర్టర్ ఫీల్డ్(73), ఓబ్రీన్(64) అర్ధ సెంచరీలతో రాణించారు. డీ/ఎల్ ప్రకారం శ్రీలంక 76 పరుగులతో గెలిచినట్టు అంపైర్లు ప్రకటించారు. శ్రీలంక బౌలర్లలో 5 వికెట్లు పడగొట్టాడు. మాథ్యూస్ 2 వికెట్లు తీశాడు. వన్డేల్లో ఫస్ట్ మ్యాచ్ లోనే 5 వికెట్లు పడగొట్టిన 12వ బౌలర్ గా షనక గుర్తింపుపొందాడు.