లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ క్యాండీ ఫాల్కన్స్ ఘన విజయం సాధించింది. పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్‌లో దంబుల్లా సిక్సర్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిక్సర్స్.. మార్క్ చాప్‌మన్ (61 బంతుల్లో 91 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), చమిందు విక్రమసింఘే (42 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
వీరిద్దరు మినహా సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. గుణతిలక 11, కుశాల్ పెరీరా 0, నువనిదు ఫెర్నాండో 4, తౌహిద్ హ్రిదోయ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఫాల్కన్స్ బౌలర్లలో షనక 3 వికెట్లు పడగొట్టగా.. హస్నైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫాల్కన్స్.. దినేశ్ చండీమల్ (40 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (20 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), షనక (15 బంతుల్లో 46 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో 17.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. షనక సిక్సర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు.
ముస్తాఫిజుర్ వేసిన 16వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, బౌండరీ సహా 23 పరుగులు పిండుకున్నాడు. సిక్సర్స్ బౌలర్లలో నువాన్ తుషార, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అఖిల ధనంజయ, చమిందు విక్రమసింఘే తలో వికెట్ పడగొట్టారు.
లీగ్‌లో భాగంగా ఇవాళ (జులై 2) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్, గాలే మార్వెల్స్.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కొలొంబో స్ట్రయికర్స్, క్యాండీ ఫాల్కన్స్ పోటీపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment