T20 World Cup 2022: Sri Lanka Pacer Dilshan Madushanka Ruled Out, Know His Replacement - Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: శ్రీలంకకు భారీ షాక్‌.. యువ బౌలర్‌ దూరం

Published Sun, Oct 16 2022 10:57 AM | Last Updated on Sun, Oct 16 2022 4:21 PM

T20 WC 2022: Sri Lanka pacer Dilshan Madhushanka ruled out of the tournament - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ పేసర్‌ దిల్షాన్ మధుశంక గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు ట్రైనింగ్‌లో సెషన్‌లో మధుశంక మెకాలికి గాయమైంది.

దీంతో అతడిని ఎ‍మ్మరై స్కాన్‌కు తరలించగా.. గాయం తీవ్రమైనదిగా తేలింది. ఈ క్రమంలోనే టోర్నీ మొత్తానికి మధుశంక దూరమయ్యాడు. అదే విధంగా త్వరలోనే అతడి స్థానాన్ని శ్రీలంక క్రికెట్‌ భర్తీ చేసే అవకాశం ఉంది.  అయితే రిజర్వ్‌ జాబితా ఉన్న బినూర ఫెర్నాండో ప్రధాన జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. ఇక ఈ మెగా ఈవెంట్‌ తొలి మ్యాచ్‌లో గీలాంగ్‌ వేదికగా నమీబియాతో శ్రీలంక తలపడుతోంది.
చదవండి: Women's Asia Cup 2022: శ్రీలంకపై అద్భుత విజయం.. అమ్మాయిల సెలబ్రేషన్స్‌ మామాలుగా లేవుగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement