గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో లంక క్లీన్ స్వీప్ చేసింది. 514 పరుగుల భారీ వెనకంజతో ఫాలోఆన్ ఆడిన కివీస్.. రెండో ఇన్నింగ్స్‌లో 360 పరుగులకు ఆలౌటైంది.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో శ్రీలంక అరంగేట్ర పేసర్ నిషాన్ పీరిస్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. పీరిస్ 6 వికెట్లతో సత్తాచాటాడు. కివీస్ బ్యాటర్లలో కాన్వే(61), టామ్ బ్లండెల్(60), గ్లెన్ ఫిలిప్స్(78), మిచెల్ శాంట్నర్(67) హాఫ్ సెంచరీలు చేశారు.
88 పరుగులకే కివీస్ ఆలౌట్..
ఇక రెండో ఇన్నింగ్స్‌లో కాస్త పోరాట పటిమ చూపిన న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం దారుణమైన ప్రదర్శన కనబరిచింది. కేవలం 88 పరుగులకే ఆలౌటై ఘోర ఆ ప్రతిష్టతను మూటకట్టుకుంది. లంక బౌలర్లు దాటికి కివీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు.
కివీస్ బ్యాటర్లలో మిచెల్ శాంట్నర్ (51 బంతుల్లో 29; 4 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా... రచిన్ రవీంద్ర (10), డారిల్ మిషెల్ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టామ్ లాథమ్ (2), డ్వేన్ కాన్వే (9), కేన్ విలియమ్సన్ (7), ఎజాజ్ పటేల్ (8), టామ్ బ్లండెల్ (1), గ్లెన్ ఫిలిప్స్ (0) విఫలమయ్యారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 6, నిషాన్ మూడు వికెట్లు పడగొట్టారు.
లంక భారీ స్కోర్..
ఇక తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 602 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కమిందు మెండిస్(182), చండీమాల్(116), కుశాల్ మెండిస్(106) అద్భుతమైన సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్లాక్‌క్యాప్స్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 88 పరుగులకే ఆలౌట్ కావడంతో.. శ్రీలంకకు తొలి ఇన్నింగ్స్‌లో 514 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత ఫాలోఆన్ ఆడిన కివీస్.. ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
చదవండి: IND vs BAN: టీమిండియా ఓపెనర్‌గా సంజూ శాంసన్..?
Comments
Please login to add a commentAdd a comment