కొలంబో వేదికగా శ్రీలంక వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ పట్టుబిగుస్తోంది. పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 576 పరుగుల పరుగుల భారీ స్కోర్ సాధించింది. 563/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన పాకిస్తాన్.. అదనంగా 13 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
దీంతో పాకిస్తాన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 410 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (201; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్ సెంచరీ చేయగా... ఆఘా సల్మాన్ (132 బ్యాటింగ్; 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించాడు. ఇక 410 పరుగులు వెనుకుబడి తమ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక.. 29 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది.
క్రికెట్ చరిత్రలోనే సరికొత్త షాట్
ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఓ సరికొత్త షాట్‌ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు. పాకిస్తాన్ ఇన్నింగ్‌లో అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో ఓ బంతిని.. బాబర్ వినూత్న షాట్‌తో స్లిప్ దిశగా బౌండరీ పంపాడు. ఫుల్ అండ్ ఔట్ సైడ్ పడిన బంతిని బాబర్ తన బ్యాట్‌ని పైకెత్తి వదిలివేయాలని తొలుత అనుకున్నట్లు కన్పించింది.
కానీ వెంటనే బాబర్ తన మైండ్ మార్చుకోని లేట్‌గా షాట్ ఆడాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని మొదటి స్లిప్, గల్లీ మధ్య నుంచి బౌండరీ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
బాబర్ ఉద్దేశపూర్వకంగానే ఆడాడని మరి కొందరు అంటున్నారు. ఆజం నెట్స్‌లో ఈ షాట్ ప్రాక్టీస్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో కూడా ఆజం నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి: IND vs WI: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. అలా అయితే సచిన్, గంగూలీ!
Babar Azam played that shot intentionally and guided it for four. Root and Williamson play it too! Babar has mastered it and can play it whenever he wants to 💚
— Farid Khan (@_FaridKhan) July 26, 2023
Commentators don't follow Babar in the nets and it shows, they don't know a thing 👎 #SLvPAK https://t.co/4iyVqnmGgH pic.twitter.com/5JRkMb1W5n
Comments
Please login to add a commentAdd a comment