అనుకున్నదే జరిగింది. చరిత్ర పునరావృతమైంది. భారత్ పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్లో తలపడితే చూడాలని ఆశపడ్డ అభిమానులకు మరోసారి భంగపాటు ఎదురయింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్.. శ్రీలంక చేతిలో రెండు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో దసున్ షనక బృందం ఆసియా కప్ 2023 ఫైనల్ కు దూసుకెళ్లింది. సెప్టెంబర్ 17న టీమిండియాతో ట్రోఫీ కోసం తలపడనుంది.
కొలంబో వేదికగా గురువారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్లో 42 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి బాబర్ ఆజం బృందం 252 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక డి.ఎల్.ఎస్ పద్ధతిలో విధించిన 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో గెలుపొంది టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది.
ఉత్కంఠ పోరులో పాక్‌పై శ్రీలంక విజయం
ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా శ్రీలంక-పాకిస్తాన్ జరిగిన మద్య జరిగిన మాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. చివరి వరకు సాగిన ఉత్కంఠ పోరులో పాక్‌పై శ్రీలంక రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి బంతికి శ్రీలంకను గెలిపించిన అసలంక. దీంతో శ్రీలంక ఫైనల్‌కు చేరింది. ఈ నెల 17న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక, భారత్‌తో తలపడనుంది.
స్కోర్లు: పాక్ 252/7, శ్రీలంక 253/8
ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
246/8 వద్ద శ్రీలంక ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ప్రమోద్ మదుశన్ ఔటయ్యాడు.
ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
243/7 వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. దునిత్ వెల్లలేజ్ ఔటయ్యాడు.
ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక
243/6 వద్ద శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. ధనుంజయ సిల్వ ఔటయ్యాడు.
ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
222/5 (37) వద్ద శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. దసున్ శనక (2) పరుగులకు ఔటయ్యాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక
210/4 (35) వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. కుసాల్ మండీస్ (91) పరుగులకు ఔటయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
177/3 (29) వద్ద శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. సమర విక్రమ (48) పరుగులకు ఔటయ్యాడు.
రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక
77 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. నిస్సంక ఔటయ్యాడు.
పాక్ 252/7.. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక
20 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. కుశాల్ పెరీరా (17) రనౌటయ్యాడు.
చెలరేగిన రిజ్వాన్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్
ఇన్నింగ్స్ ఆరంభంలో ఆచితూచి ఆడిన పాక్ చివర్లో చెలరేగి ఆడింది. ముఖ్యంగా మహ్మద్ రిజ్వాన్ (73 బంతుల్లో 86 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించాడు. అతనికి ఇఫ్తికార్ అహ్మద్ (47) సహకరించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో అబ్దుల్లా షఫీక్ (52) అర్ధ సెంచరీతో రాణించాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను తొలుత 45 ఓవర్లకు, మధ్యలో 42 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. నిర్ణీత 42 ఓవర్లలో పాక్ స్కోర్ 252/7గా ఉంది. లంక బౌలర్లలో పతిరణ 3, మధుషన్ 2, తీక్షణ, వెల్లలగే చెరో వికెట్ పడగొట్టారు.
36 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 192/5
36 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 192/5గా ఉంది. మహ్మద్ రిజ్వాన్ (57), ఇఫ్తికార్ అహ్మద్ (23) క్రీజ్‌లో ఉన్నారు.
వర్షం అంతరాయం.. 27.4 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 130/5
వర్షం మరోసారి మ్యాచ్‌కు ఆటంకం కలిగించింది. ఐదో వికెట్ పడ్డవెంటనే మొదలైంది. 27.4 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 130/5గా ఉంది. రిజ్వాన్ (22) క్రీజ్‌లో ఉన్నాడు.
27 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 128/4
27 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ స్కోర్ 128/4గా ఉంది. మొహమ్మద్ నవాజ్ (10), మొహమ్మద్ రిజ్వాన్ (22) క్రీజ్‌లో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్
73 పరుగుల వద్ద పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. యువ స్పిన్నర్ వెల్లలగే బౌలింగ్‌లో బాబర్ ఆజమ్ (29) స్టంపౌటయ్యాడు.
నత్త నడకలా సాగుతున్న పాక్ బ్యాటింగ్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ 6 ఓవర్లలో వికెట్ కోల్పోయి 19 పరుగులు మాత్రమే చేసింది. పాక్ ఇన్నింగ్స్ నత్త నడకలా సాగుతుంది. ప్రమోద్ మధుషన్ ఫఖర్ జమాన్‌ను (4) క్లీన్ బౌల్డ్ చేయగా.. అబ్దుల్లా షఫీక్ (6), బాబర్ ఆజమ్ (9) క్రీజ్‌లో ఉన్నారు.
తుది జట్లు..
పాకిస్తాన్: ఫకర్ జమాన్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), మొహమ్మద్ హరీస్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మొహమ్మద్ నవాజ్, జమాన్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మొహమ్మద్ వసీం జూనియర్
శ్రీలంక: పథుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, దసున్ షనక, దునిత్ వెల్లలగే, మహీష్ తీక్షణ, ప్రమోద్ మధుషన్, మతీష పతిరణ
ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా శ్రీలంక-పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (సెప్టెంబర్ 14) జరగాల్సిన కీలక మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమవుతుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో కనీసం టాస్ కూడా పడలేదు. పరిస్థితులను చూస్తుంటే ఈ మ్యాచ్ రద్దయ్యేలా కనిపిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంటుంది.
పాక్‌తో పోలిస్తే మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా లంక ఈ ఛాన్స్ కొట్టేస్తుంది. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో శ్రీలంక.. టీమిండియాను ఢీకొంటుంది. మరోవైపు పాక్ ఫైనల్‌కు చేరాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అది ఇవాల్టి మ్యాచ్ జరిగి, అందులో పాక్ విజయం సాధించాలి. పాక్‌కు గెలుపు కాకుండా ఎలాంటి ఫలితం వచ్చినా ప్రయోజనం లేదు. కాగా, మరో సూపర్-4 మ్యాచ్ జరగాల్సి ఉండగానే భారత్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
సూపర్-4 దశలో టీమిండియా వరుసగా పాకిస్తాన్, శ్రీలంకలను మట్టికరిపించి, తుది పోరుకు అర్హత సాధించింది. ఫైనల్‌కు ముందు భారత్ రేపు (సెప్టెంబర్ 15) బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రయోగాల బాటపట్టే అవకాశం ఉంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు అవకాశం రాని ఆటగాళ్లకు మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా పలువురు స్టార్ ప్లేయర్లు రెస్ట్ తీసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment