IPL 2025: తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఆర్సీబీ ఘన విజయం | IPL 2025 KKR vs RCB 1st Match Live Updates and Highlights | Sakshi
Sakshi News home page

IPL 2025: తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఆర్సీబీ ఘన విజయం

Published Sat, Mar 22 2025 5:50 PM | Last Updated on Sat, Mar 22 2025 10:59 PM

IPL 2025 KKR vs RCB 1st Match Live Updates and Highlights

IPL 2025 RCB vs KKR 1st Match Live Updates: 

బోణీ కొట్టిన ఆర్సీబీ..
ఐపీఎల్‌-2025లో ఆర్సీబీ బోణీ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజ‌యం సాధించింది. 175 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి(59) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్‌సాల్ట్‌(31 బంతుల్లో 56), పాటిదార్‌(16 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా,సునీల్ నరైన్ తలా వికెట్ సాధించారు.
విజయం దిశగా ఆర్సీబీ..
తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 15 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 157  పరుగులు చేసింది. ఆర్సీబీ విజయానికి ఇంకా 18 పరుగులు కావాలి. క్రీజులో విరాట్‌ కోహ్లి(50), రజిత్‌ పాటిదార్‌(30) పరుగులతో ఉన్నారు.

విరాట్‌ కోహ్లి హాఫ్‌ సెంచరీ..
ఆర్సీబీ స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లి తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కేవలం 30 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో కోహ్లి హాఫ్‌ సెంచరీ సాధించాడు. కోహ్లి 54 పరుగులతో బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 134/2

తొలి వికెట్‌ డౌన్‌..
95 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. 56 పరుగులు చేసిన ఫిల్‌ సాల్ట్‌.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి దేవ్‌దత్త్‌ పడిక్కల్‌ వచ్చాడు. 9 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 96/1

6 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 80/0
6 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్‌ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్‌ సాల్ట్‌(49), విరాట్‌ కోహ్లి(29) పరుగులతో ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ..
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్‌(26), విరాట్ కోహ్లి(11) ఉన్నారు.

రహానే హాఫ్‌ సెంచరీ.. ఆర్సీబీ టార్గెట్‌ ఎంతంటే?
ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ దిగిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేకేఆర్‌ బ్యాటర్లలో అజింక్య రహానే(56) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సునీల్‌ నరైన్‌(44),రఘువంశీ(30) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్‌ దయాల్‌, సుయాష్‌ శర్మ, సలీం​ తలా వికెట్‌ సాధించారు.

173 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
హర్షిత్‌ రానా(5) ఔట్‌

ఏడో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌

168 పరుగుల వద్ద ఆర్సీబీ ఏడో వికెట్‌ కోల్పోయింది. 30 పరుగులు చేసిన రఘువంశీ యశ్‌ దయాల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

18 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ స్కోర్‌ 165/6
18 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. క్రీజ్‌లో  రఘు వంశీ(28),  రమణ్‌ దీప్‌ సింగ్‌(5)  ఉన్నారు.

కేకేఆర్‌ ఆరో వికెట్‌ డౌన్‌.. రస్సెల్‌ ఔట్‌
రస్సెల్‌ రూపంలో కేకేఆర్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రస్సెల్‌.. సుయాష్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

కృనాల్‌ సూపర్‌ బాల్‌.. రింకూ ఫ్యూజ్‌లు ఔట్‌
కేకేఆర్‌ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది. 12 పరుగులు చేసిన రింకూ సింగ్‌.. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి అండ్రీ రస్సెల్‌ వచ్చాడు. 15 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 145/5

నాలుగో వికెట్‌ డౌన్‌..
వెంకటేశ్‌ అయ్యర్‌ రూపంలో కేకేఆర్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన అయ్యర్‌.. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. 14 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 141/4

రహానే ఔట్‌..
109 పరుగుల వద్ద కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 56 పరుగులు చేసిన రహానే.. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రఘువన్షి వచ్చాడు. 11 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 110/3

కేకేఆర్‌ రెండో వికెట్‌ డౌన్‌.. 
సునీల్‌ నరైన్‌ రూపంలో కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 44 పరుగులు చేసిన నరైన్‌.. రసీఖ్‌ ధార్‌ సలీం బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి వెంకటేశ్‌ అయ్యర్‌ వచ్చాడు.

రహానే హాఫ్‌ సెంచరీ..
కేకేఆర్‌ కెప్టెన్‌ అజింక్య రహానే హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 54 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు సునీల్‌ నరైన్‌(34) ఉన్నాడు. 9 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 96/1

దూకుడుగా ఆడుతున్న రహానే..
6 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ వికెట్‌ నష్టానికి 60 పరుగులు చేసింది. కెప్టెన్‌ అజింక్య రహానే(39) దూకుడుగా ఆడుతున్నాడు.

4 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 25/1
4 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ వికెట్‌ నష్టానికి 25 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్‌ అజింక్య రహానే(16), వెంకటేశ్‌ అయ్యర్‌(5) పరుగులతో ఉన్నారు.

కేకేఆర్‌​ తొలి వికెట్‌ డౌన్‌..
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే బిగ్‌ షాక్‌ తగిలింది. జోష్‌ హాజిల్‌వుడ్‌​ తొలి ఓవర్‌లోనే కేకేఆర్‌ స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌​ డికాక్‌(4)ను పెవిలియన్‌కు పంపాడు. క్రీజులోకి కెప్టెన్‌ అజింక్య రహానే వచ్చాడు.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ..
ఐపీఎల్‌-2025 తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడర్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి పోరులో ఆర్సీబీ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది.

తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్‌), రజత్ పాటిదార్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్‌), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే(కెప్టెన్‌​), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

 👉ఐపీఎల్‌-18వ సీజన్‌ ట్రోఫీని ఆవిష్కరించిన ఆర్సీబీ కెప్టెన్‌ రజిత్‌ పాటిదార్‌, కేకేఆర్‌ కెప్టెన్‌ అజింక్య రహానే.

👉షారుఖ్‌ ఖాన్‌తో కలిసి డ్యాన్స్‌ చేసిన విరాట్‌ కోహ్లి, రింకూ సింగ్‌

👉 కోల్‌కతా జట్టు సహ యజమాని, బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌తో కలిసి ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి ప్రసంగిస్తున్నాడు. వీరితో కేకేఆర్‌ ఫినిషర్‌ రింకూ సింగ్‌ జతకట్టాడు.

డ్యాన్స్‌తో అదరగొడుతున్న దిశా
బాలీవుడ్  హీరోయిన్ దిశా పటానీ తన డ్యాన్స్‌తో అభిమానులను అలరిస్తోంది. ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది.

👉తన గాత్రంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తున్న శ్రేయా ఘోషల్‌
ఈడెన్‌ గార్డెన్స్‌లో ఐపీఎల్-2025 ఓపెనింగ్‌ సెర్మనీ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) తన గాత్రంతో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. పుష్ఫ-2 సినిమాలోని ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ పాటను తెలుగులో పాడటం విశేషం.

👉ఈడెన్‌ గార్డెన్స్‌ షారుఖ్‌ ఖాన్‌ సందడి
ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా జట్టు సహ యజమాని, బాలీవుడ్‌ బాద్‌ షా ప్రసంగించాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్‌గా వెలుగొందిన క్రికెట్‌ లీగ్‌లో భాగం కావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు.

👉మరి కాసేపటిలో ఓపెనింగ్‌ సెర్మనీ
ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవ వేడుకలు మరి కాసేపటిలో ప్రారంభం కానున్నాయి. ప్రముఖ గాయకులు శ్రేయా ఘోషల్, అర్జిత్ సింగ్, కరణ్ ఔజ్లా అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యారు. వీరితో పాటు బాలీవుడ్  హీరోయిన్ దిశా పటానీ తన డ్యాన్స్ ప్రదర్శనతో అదరగొట్టబోతోంది. ఇందుకోసం వీరు నలుగురు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు చేరుకున్నారు.

👉ఐపీఎల్‌-2025కు సర్వం సిద్దం.. 
ఐపీఎల్‌-2025 సీజ‌న్‌కు మ‌రి కాసేప‌టిలో తెర‌లేవ‌నుంది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా డిఫెండింగ్ ఛాంపియ‌న్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి.  రాత్రి ఏడు గంటలకు టాస్‌ పడనుంది. 

👉స్టేడియానికి చేరుకున్న ఇరు జట్లు
ఇక తొలి మ్యాచ్ కోసం కేకేఆర్‌, ఆర్సీబీ జట్లు ఈడెన్‌గార్డెన్స్ మైదానానికి చేరుకున్నాయి. ఫ్యాన్స్ కూడా భారీగా తరలివస్తున్నారు. ఈడెన్‌గార్డెన్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.

👉అభిమానులకు గుడ్‌న్యూస్‌
కోల్‌క‌తాలో గ‌త రెండు రోజులగా వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో తొలి మ్యాచ్‌కు వ‌రుణుడు అడ్డింకిగా మారుతాడో ఏమో అని అభిమానులు ఆందోళ‌ను చెందుతున్నారు. అయితే ఐపీఎల్ ల‌వ‌ర్స్‌కు ఓ గుడ్ న్యూస్‌. ప్ర‌స్తుతం కోల్‌క‌తాలో వ‌ర్షం ప‌డ‌డం లేదు. ఆకాశం మేఘావృతం ఉన్నప్పటికి వాతావరణం పొడిగా ఉంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement