
పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య ఇవాళ (జులై 16) మొదలైన తొలి టెస్ట్ మ్యాచ్‌లో కళ్లు చెదిరే క్యాచ్ ఒకటి నమోదైంది. పాక్ ఆటగాడు ఇమామ్ ఉల్ హాక్ ఈ క్యాచ్ పట్టాడు. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇమామ్.. గాల్లోకి ఎగురుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. అఘా సల్మాన్ బౌలింగ్‌లో ఈ ఫీట్ నమోదైంది. ఇమామ్ సూపర్ క్యాచ్ పట్టడంతో సమరవిక్రమ పెవిలియన్ బాట పట్టక తప్పలేదు.
Imam ul Haq with a superb catch@ImamUlHaq12#PakistanCricket #PAKvSL #CricketTwitter pic.twitter.com/gXtjHezRF4
— Hamza Siddiqui (@HamzaSiddiqui56) July 16, 2023
ఇమామ్ విన్యాసానికి ఫిదా అయిపోయిన క్రికెట్ అభిమానులు, సోషల్‌మీడియా వేదికగా అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వాటే క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇమామ్ క్యాచ్ పట్టిన వెంటనే అంపైర్లు తొలి రోజు ఆటకు ముగించారు. పలు మార్లు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు కేవలం 65.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వ (94) క్రీజ్‌లో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. డిసిల్వతో పాటు ఏంజెలో మాథ్యూస్ (64) అర్ధసెంచరీలతో రాణించారు. నిషాన్ మధుష్క (4), కుశాల్ మెండిస్ (12), దినేశ్ చండీమాల్ (1) విఫలం కాగా.. దిముత్ కరుణరత్నే (29), సదీర సమరవిక్రమ (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, అబ్రార్ అహ్మద్, అఘా సల్మాన్ తలో వికెట్ దక్కించుకున్నారు.