Imam ul Haq
-
Asia Cup 2023: టీమిండియా స్టార్లను ఊరిస్తున్న భారీ రికార్డులు
ఆసియా కప్-2023 ప్రారంభానికి ముందు పలువురు స్టార్ క్రికెటర్లను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మెగా టోర్నీలో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వేర్వేరు విభాగాల్లో పలు రికార్డులను బద్దలుకొట్టే అవకాశం ఉంది. ఆ రికార్డులు ఏవంటే.. విరాట్ కోహ్లి: ఆసియా కప్-2023లో విరాట్ మరో 102 పరుగులు చేస్తే వన్డేల్లో 13000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఫార్మాట్లో 13000 పరుగుల మార్కును అందుకున్న ఐదో ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 12898 పరుగులు ఉండగా.. అతనికి ముందు సచిన్ (18426), సంగక్కర (14234), పాంటింగ్ (13734), జయసూర్య (13430) ఈ ఘనత సాధించారు. ఈ రికార్డుతో పాటు విరాట్ మరో భారీ రికార్డుపై కూడా కన్నేశాడు. ఆసియా కప్‌లో అతను 13000 పరుగుల మార్కును అందుకుంటే, వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 13000 పరుగులు సాధించిన రికార్డు సచిన్ (321 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండగా.. విరాట్ (265 ఇన్నింగ్స్‌లు) సచిన్ కంటే చాలా ముందే ఈ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. విరాట్ పై పేర్కొన్న రెండు భారీ రికార్డులతో పాటు మరో అత్యంత భారీ రికార్డుపై కూడా కన్నేశాడు. ఆసియా కప్-2023లో అతను మరో 4 సెంచరీలు చేస్తే, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ (49) రికార్డును బద్దలు కొట్టి, సెంచరీల హాఫ్ సెంచరీని పూర్తి చేస్తాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 46 వన్డే సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ: ఆసియా కప్ 2023లో రోహిత్ మరో 163 పరుగులు చేస్తే వన్డేల్లో 10000 పరుగుల మార్కును అందుకుంటాడు. తద్వారా ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 15వ క్రికెటర్‌గా.. ఆరో భారత క్రికెటర్ రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 9837 పరుగులు ఉన్నాయి. ప్రస్తుత టోర్నీలో రోహిత్ మరో 255 పరుగులు చేస్తే, ఆసియా కప్‌లో (వన్డే ఫార్మాట్) 1000 పరుగుల మార్కును అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. భారత క్రికెటర్లలో సచిన్ అత్యధికంగా ఆసియా కప్ వన్డే టోర్నీల్లో 971 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జయసూర్య, సంగక్కర మాత్రమే 1000 పరుగుల మైలురాయిని దాటారు. రవీంద్ర జడేజా: ఆసియా కప్ 2023లో జడేజా (194) మరో 6 వికెట్లు తీస్తే, వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఐదో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ విభాగంలో జయసూర్య అత్యధికంగా 323 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ అల్ హసన్: ప్రస్తుత ఆసియా కప్‌లో షకీబ్ మరో 168 పరుగులు చేస్తే, విదేశాల్లో 4000 పరుగుల మార్కును రెండో బంగ్లాదేశీగా రికార్డు సృష్టిస్తాడు. షకీబ్‌కు ముందు తమీమ్ ఇక్బాల్ (4323) ఈ ఘనత సాధించాడు. అలాగే ప్రస్తుత టోర్నీలో షకీబ్ (305) మరో వికెట్ తీస్తే, అత్యధిక వికెట్లు సాధించిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల జాబితాలో డేనియల్ వెటోరీని (305) వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకతాడు. ఇమామ్ ఉల్ హాక్: ఇమామ్ ఈ ఆసియా కప్‌లో తదుపరి 4 మ్యాచ్‌ల్లో మరో 116 పరుగులు చేస్తే, వన్డేల్లో హషీమ్ ఆమ్లా ఝ(61) తర్వాత అత్యంత వేగంగా 3000 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఇమామ్ ఖాతాలో ప్రస్తుతం 62 ఇన్నింగ్స్‌ల్లో 2884 పరుగులు ఉన్నాయి. -
నిప్పులు చెరిగిన హరీస్ రౌఫ్.. 59 పరుగులకే కుప్పకూలిన ఆఫ్ఘనిస్తాన్
3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హంబన్‌తోట (శ్రీలంక) వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఆగస్ట్ 22) జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ పేసర్ హరీస్ రౌఫ్ నిప్పులు చెరిగాడు. 6.2 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో రౌఫ్‌కు ఇది తొలి ఫైఫర్ కావడం విశేషం. రౌఫ్ భీకర స్పెల్‌కు షాహీన్ అఫ్రిది (4-2-9-2), నసీం షా (5-0-12-1), షాదాబ్ ఖాన్ (1-1-0-1) తోడవ్వడంతో పాక్.. ఆఫ్ఘనిస్తాన్‌ను 59 పరుగులకే కుప్పకూల్చింది. ఫలితంగా ఆ జట్టు ఆఫ్ఘన్‌పై 142 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పాక్ పేసర్ల ధాటికి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. ఏకంగా నలుగురు ఆటగాళ్లు డకౌట్లయ్యారు. ఓపెనర్ రహానుల్లా గుర్భాజ్ చేసిన 18 పరుగులే ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్‌గా నిలిచింది. ఒమర్జాయ్ 16 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఇమామ్ ఉల్ హాక్ (61), షాదాబ్ ఖాన్ (39), ఇఫ్తికార్ అహ్మద్ (30), మహ్మద్ రిజ్వాన్ (21), నసీం షా (18 నాటౌట్) మినహా ఎవ్వరూ రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోవడంతో 47.1 ఓవర్లలో 201 పరుగులు చేసి ఆలౌటైంది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (10-1-33-3), రషీద్ ఖాన్ (10-0-42-2), మహ్మద్ నబీ (10-0-34-2), రెహ్మత్ షా (1.1-0-6-1), ఫజల్ హక్ ఫారూకీ (8-0-51-1) ధాటికి పాక్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. -
Viral Video: కళ్లు చెదిరే క్యాచ్..!
పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య ఇవాళ (జులై 16) మొదలైన తొలి టెస్ట్ మ్యాచ్‌లో కళ్లు చెదిరే క్యాచ్ ఒకటి నమోదైంది. పాక్ ఆటగాడు ఇమామ్ ఉల్ హాక్ ఈ క్యాచ్ పట్టాడు. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇమామ్.. గాల్లోకి ఎగురుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. అఘా సల్మాన్ బౌలింగ్‌లో ఈ ఫీట్ నమోదైంది. ఇమామ్ సూపర్ క్యాచ్ పట్టడంతో సమరవిక్రమ పెవిలియన్ బాట పట్టక తప్పలేదు. Imam ul Haq with a superb catch@ImamUlHaq12#PakistanCricket #PAKvSL #CricketTwitter pic.twitter.com/gXtjHezRF4 — Hamza Siddiqui (@HamzaSiddiqui56) July 16, 2023 ఇమామ్ విన్యాసానికి ఫిదా అయిపోయిన క్రికెట్ అభిమానులు, సోషల్‌మీడియా వేదికగా అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వాటే క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇమామ్ క్యాచ్ పట్టిన వెంటనే అంపైర్లు తొలి రోజు ఆటకు ముగించారు. పలు మార్లు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు కేవలం 65.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వ (94) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. డిసిల్వతో పాటు ఏంజెలో మాథ్యూస్ (64) అర్ధసెంచరీలతో రాణించారు. నిషాన్ మధుష్క (4), కుశాల్ మెండిస్ (12), దినేశ్ చండీమాల్ (1) విఫలం కాగా.. దిముత్ కరుణరత్నే (29), సదీర సమరవిక్రమ (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, అబ్రార్ అహ్మద్, అఘా సల్మాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
సౌద్ షకీల్ శతకం.. కివీస్‌కు ధీటుగా బదులిస్తున్న పాక్
PAK VS NZ 2nd Test 3rd Day: కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాకిస్తాన్ ధీటుగా బదులిస్తుంది. సౌద్ షకీల్ (336 బంతుల్లో 124 నాటౌట్; 17 ఫోర్లు) టెస్ట్‌ల్లో తన తొలి శతకంతో రెచ్చిపోవడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిధ్య జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 407 పరుగులు చేసింది. షకీల్‌కు జతగా ఇమామ్ ఉల్ హాక్ (83), వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (78) అర్ధసెంచరీలతో రాణించగా.. ఆఘా సల్మాన్ (41) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. ఇష్ సోధీ 2, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 449 పరుగులకు ఆలౌటైంది. డెవాన్ కాన్వే (122) సెంచరీతో చెలరేగగా.. టామ్ లాథమ్ (71), టామ్ బ్లండల్ (51), మ్యాట్ హెన్రీ (68) అర్ధశతకాలతో రాణించారు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 4 వికెట్లతో సత్తా చాటగా.. నసీమ్ షా, అఘా సల్మాన్ 3 వికెట్లతో రాణించారు. కాగా, సప్పగా సాగుతున్న ఈ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. దీనికి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ కోసం బౌలర్లకు అనుకూలమైన పిచ్‌లు తయారు చేశారని విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. వరుస పరాభవాలను తప్పించుకునేందుకు ఈ సిరీస్ కోసం నిర్జీవమైన పిచ్‌లు తయారు చేసింది. ఇంగ్లండ్ చేతిలో పాక్ 0-3 తేడాతో వైట్‌వాష్ అయిన విషయం తెలిసిందే. -
పాకిస్తాన్‌కు మరో పరాభవం తప్పదా..? సిరీస్‌పై కన్నేసిన ఇంగ్లండ్
PAK VS ENG 2nd Test Day 3: 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. చారిత్రక సిరీస్‌పై కన్నేసింది. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ నెగ్గి జోరుమీద ఉన్న స్టోక్స్ సేన.. రెండో టెస్ట్‌పై కూడా పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విజయానికి 6 వికెట్ల దూరంలో ఉన్న ఇంగ్లండ్.. నాలుగో రోజు లంచ్ సమయానికే ఆట ముగించే అవకాశం ఉంది. మరో పక్క ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు పాకిస్తాన్‌కు సైతం అవకాశాలు ఉన్నాయి. ఆ జట్టు మరో 157 పరుగులు చేస్తే, సిరీస్ సమం చేసుకునే అవకాశం ఉంది. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హక్ (60), సౌద్ షకీల్ (54 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. షకీల్‌తో పాటు ఫహీమ్ అష్రాఫ్ (3) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్, జాక్ లీచ్, మార్క్ వుడ్, ఆండర్సన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (108) సెంచరీతో చెలరేగగా.. బెన్ డకెట్ (79) అర్ధసెంచరీతో రాణించాడు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 4, జహీద్ మహమూద్ 3, నవాజ్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు చాపచుట్టేయగా.. ఇంగ్లండ్ 281 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన అబ్రార్ అహ్మద్.. తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే 10 వికెట్ల ఘనత సాధించాడు. -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘట్టం
పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ పలు ప్రపంచ రికార్డులకు వేదికైంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి రోజు అత్యధిక స్కోర్ (506/4) రికార్డుతో పాటు తొలి రోజు 500 పరుగుల సాధించిన తొలి జట్టుగా, తొలి సెషన్లో అత్యధిక పరుగులు (27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 174 పరుగులు) చేసిన జట్టుగా ఇంగ్లండ్ టీమ్ పలు ప్రపంచ రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. వీటన్నిటికీ మించి తొలి రోజు ఏకంగా నలుగురు ఇంగ్లండ్ బ్యాటర్లు సెంచరీలు నమోదు చేశారు. ఇలా తొలి రోజు నలుగురు బ్యాటర్లు శతక్కొట్టడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే ప్రధమం. ఓపెనర్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడ్డారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. ఇంగ్లండ్ భారీ స్కోర్‌కు (657) ధీటుగా జవాబిస్తుంది. ఆ జట్టు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (203 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇమామ్ ఉల్ హాక్ (207 బంతుల్లో 121; 15 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (168 బంతుల్లో 136; 19 ఫోర్లు, సిక్స్) శతకాలతో విరుచుకుపడ్డారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో తొలి ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధిస్తే.. పాక్ టాప్-4 బ్యాటర్లలో ముగ్గురు శతకొట్టారు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 499 పరుగులు చేసింది. కాగా, ఇదే టెస్ట్ మ్యాచ్‌లో పై పేర్కొన్న రికార్డులతో పాటు టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఓ అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఓపెనర్లు (బెన్ డకెట్, జాక్ క్రాలే, అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్) తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు బాదడం ఇదే తొలిసారి. అలాగే ఓ టెస్ట్ మ్యాచ్‌లో తొలి వికెట్‌కు రెండు డబుల్ హండ్రెడ్ పార్ట్నర్షిప్లు నమోదు కావడం కూడా ఇదే తొలిసారి. 1948లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్-ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన నలుగురు ఓపెనర్లు సెంచరీలు సాధించారు. అయితే, ఆ నలుగురు ఓపెనర్లలో ఒకరు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించారు. -
ఇంగ్లండ్‌కు ధీటుగా బదులిస్తున్న పాక్.. వాళ్లు 4 శతకాలు బాదితే, వీళ్లు 3 కొట్టారు
రావల్పిండి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిధ్య పాకిస్తాన్.. ప్రత్యర్ధికి ధీటుగా బదులిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నలుగురు బ్యాటర్లు సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. తామేమీ తక్కువ కాదు అన్నట్లు రెచ్చిపోయి ఆడుతుంది. ఆ జట్టు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (203 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇమామ్ ఉల్ హాక్ (207 బంతుల్లో 121; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా కెప్టెన్ బాబర్ ఆజమ్ (126 బంతుల్లో 106 నాటౌట్; 14 ఫోర్లు, సిక్స్) శతకాలతో విరుచుకుపడ్డారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో తొలి ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధిస్తే.. పాక్ టాప్-4లో ముగ్గురు బ్యాటర్లు శతకొట్టారు. ఫలితంగా ఆట మూడో రోజు టీ విరామం సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ సహా సౌద్ షకీల్ (35) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి పాక్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 246 పరుగులు వెనుకపడి ఉంది. నిర్జీవమైన ఈ పిచ్‌పై పాక్ సైతం భారీ స్కోర్ చేసే అవకాశం ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగియడం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలి రోజు నుంచే పలు ప్రపంచ రికార్డులు బద్దలైన విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి రోజు అత్యధిక స్కోర్ (506/4) రికార్డుతో పాటు తొలి రోజు 500 పరుగుల సాధించిన తొలి జట్టుగా, తొలి సెషన్లో అత్యధిక పరుగులు (27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 174 పరుగులు) చేసిన జట్టుగా ఇంగ్లండ్ టీమ్ పలు ప్రపంచ రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. వీటన్నిటికీ మించి తొలి రోజు ఏకంగా నలుగురు ఇంగ్లండ్ బ్యాటర్లు సెంచరీలు నమోదు చేశారు. ఇలా తొలి రోజు నలుగురు బ్యాటర్లు శతక్కొట్టడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే ప్రధమం. ఓపెనర్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడ్డారు. -
దూసుకుపోతున్న పాక్ ప్లేయర్లు.. టీమిండియా నుంచి ఆ ముగ్గురు..!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ ఆటగాళ్ల హవా కొనసాగింది. స్వదేశంలో ఆసీస్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆ జట్టు ఆటగాళ్లు బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హాక్, షాహీన్ అఫ్రిదిలు తాజా వన్డే ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. ఆసీస్‌తో జరిగిన 3 వన్డేల్లో (103, 106, 89 నాటౌట్) 298 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హాక్ ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి (795 రేటింగ్ పాయింట్లు) చేరుకోగా, అదే సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌ల్లో ( 57, 114, 105) 276 పరుగులు చేసిన బాబర్ ఆజమ్.. భారీగా రేటింగ్ పాయింట్లు పెంచుకుని అగ్రస్థానంలో (891 పాయింట్లు) స్థిరపడ్డాడు. 🔸 Shaheen Afridi continues to climb 🔸 Imam-ul-Haq makes significant gains Pakistan players make major movements in the @MRFWorldwide ICC Men's Player Rankings for ODIs and Tests after #PAKvAUS series 📈 Details 👉 https://t.co/zoY06jyBJ3 pic.twitter.com/dxVyiF78oK — ICC (@ICC) April 6, 2022 ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో 2 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టిన షాహీన్ అఫ్రిది బౌలింగ్ విభాగంలో ఏకంగా 8 స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో ప్లేస్‌కు (671 పాయింట్లు) చేరాడు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి (811), రోహిత్ శర్మ (791) తమ 2, 4 స్థానాలను పదిలం చేసుకోగా.. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (679) ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలింగ్ విభాగంలో కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్, ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, న్యూజిలాండ్ మ్యాట్ హెన్రీ, బంగ్లా స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. మరోవైపు టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగనప్పటికీ, టీమిండియా పేసర్ బుమ్రా (830) ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని మూడో ప్లేస్‌కు, పాక్ స్పీడ్ గన్ షాహీన్ అఫ్రిది (827) నాలుగో స్థానానికి ఎగబాకారు. ఈ జాబితాలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 901 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (850) రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. చదవండి: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీస్ ఎవరంటే..? -
20 ఏళ్ల తర్వాత ఆసీస్‌పై వన్డే సిరీస్ సొంతం
కెప్టెన్ బాబర్ ఆజమ్ (105 నాటౌట్; 12 ఫోర్లు), ఇమామ్ (89 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో... ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో నెగ్గింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను పాక్ 2–1తో సొంతం చేసుకుంది. 2002 తర్వాత ఆస్ట్రేలియాపై పాక్ తొలిసారి వన్డే సిరీస్ దక్కించుకుంది. ముందుగా ఆసీస్ 41.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్‌కాగా... పాక్ 37.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని అందుకుంది. -
Pak Vs Aus: ఆసీస్‌పై సంచలన విజయం.. పాకిస్తాన్ సరికొత్త రికార్డు!
Pakistan Vs Australia ODI Series 2022- లాహోర్: పాకిస్తాన్ జట్టు తమ వన్డే చరిత్రలో అతి పెద్ద లక్ష్యాన్ని ఛేదించింది. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాక్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా ఆసీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెన్ మెక్‌డెర్మట్ (108 బంతుల్లో 104; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించగా...ట్రవిస్ హెడ్ (70 బంతుల్లో 89; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), మార్నస్ లబ్‌షేన్ (49 బంతుల్లో 59; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. షాహిన్ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం పాక్ 49 ఓవర్లలో 4 వికెట్లకు 352 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (83 బంతుల్లో 114; 11 ఫోర్లు, 1 సిక్స్), ఇమామ్ ఉల్ హఖ్ (97 బంతుల్లో 106; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో చెలరేగగా, ఫఖర్ జమాన్ (64 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. తాజా ఫలితంతో సిరీస్ 1–1తో సమం కాగా, చివరి వన్డే శనివారం జరుగుతుంది. చదవండి: IPL 2022: కేఎల్ రాహుల్ ఎంత పని జరిగే.. వీడియో వైరల్ Pakistan pulled off a record chase and gave fans plenty of moments to celebrate while they were at it! #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/9zoCbKFWw6 — Pakistan Cricket (@TheRealPCB) March 31, 2022 -
PAk Vs Aus 1st ODI: ట్రావిస్ హెడ్ మెరుపు శతకం.. పాక్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా
Pakistan Vs Australia ODI Series 2022- లాహోర్: పాకిస్తాన్‌తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 88 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 313 పరుగులు సాధించింది. On a roll. Wasim falls to Zampa. #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/Pe0mCY3vAR — Pakistan Cricket (@TheRealPCB) March 29, 2022 ట్రావిస్ హెడ్ (72 బంతుల్లో 101; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు శతకం... బెన్ మెక్‌డెర్మట్ (55; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశారు. అనంతరం పాకిస్తాన్ 45.2 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఇమామ్ ఉల్ హఖ్ (103; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), బాబర్ ఆజమ్ (57; 6 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. The visitors continue their winning streak in Lahore.#BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/0JkSX2tL4O — Pakistan Cricket (@TheRealPCB) March 29, 2022 -
PAK Vs AUS: రెండో ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన పాక్ ఓపెనర్
పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్ట్ పేలవమైన డ్రాగా ముగిసింది. ఇరు జట్ల ఆటగాళ్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌ను 476/4 వద్ద డిక్లేర్ చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆతిధ్య జట్టుకు ధీటుగా బదులిచ్చింది. ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 459 పరుగులకే ఆలౌటై పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్ టాపార్డర్ బ్యాటర్లు నలుగురు ( ఉస్మాన్ ఖ్వాజా (97), వార్నర్ (68), లబూషేన్ (90), స్టీవ్ స్మిత్ (78) అర్ధ సెంచరీలతో రాణించగా, పాక్ బౌలర్లలో నౌమాన్ అలీ 6 వికెట్లు, షాహీన్ అఫ్రిది 2, నసీమ్ షా, సాజిద్ ఖాన్లు తలో వికెట్ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్‌కు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (242 బంతుల్లో 136 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్), ఇమామ్ ఉల్ హాక్ (223 బంతుల్లో 111 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు అజేయమైన శతకాలతో విజృంభించారు. ఆఖరి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి పాక్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 252 పరుగులు చేసింది. అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హక్ (157; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజహర్ అలీ (185; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు భారీ శతకాలతో చెలరేగారు. ఈ మ్యాచ్‌లో ఇమామ్ ఉల్ హాక్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాది రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉంటే, 24 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై ఆడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు బాంబు పేలుళ్లు స్వాగతం పలికాయి. నిన్న పెషావర్‌లోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. పెషావర్‌కు మ్యాచ్ వేదిక అయిన రావల్పిండికి 187 కిమీ దూరం మాత్రమే ఉండటంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉలిక్కిపడ్డారు. చదవండి: PAK Vs AUS: వార్నర్ ఏమాత్రం తగ్గట్లేదుగా.. ఈసారి భల్లే భల్లే డ్యాన్స్‌తో..! -
PAK Vs AUS: డబుల్ చేజార్చుకున్న అజహర్ అలీ.. పాక్ భారీ స్కోర్
రావల్పిండి: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఆతిధ్య పాకిస్థాన్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి (షఫీఖ్ (44)) 245 పరుగులు చేసిన బాబర్ సేన.. రెండో రోజు కూడా దూకుడు కొనసాగించి 476/4 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి రోజు సెంచరీ హీరో ఇమామ్ ఉల్ హక్ (157; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఓవర్‌నైట్ స్కోర్‌కు 25 పరుగులు జోడించి ఔట్ కాగా, వన్‌డౌన్ ఆటగాడు అజహర్ అలీ (185) రెండో రోజు భారీ శతకాన్ని బాదాడు. కెప్టెన్ బాబార్ ఆజమ్ (36) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ కాగా, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి మహ్మద్ రిజ్వాన్ (29), ఇఫ్తికార్ అహ్మద్ (13) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్, కమిన్స్, లబూషేన్ తలో వికెట్ పడగొట్టగా, బాబర్ రనౌటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే, 24 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై ఆడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు బాంబు పేలుళ్లు స్వాగతం పలికాయి. నిన్న పెషావర్‌లోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. పెషావర్‌కు మ్యాచ్ వేదిక అయిన రావల్పిండికి 187 కిమీ దూరం మాత్రమే ఉండటంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉలిక్కిపడ్డారు. చదవండి: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. షెడ్యూల్ విడుదల ఎప్పుడంటే..? -
Babar Azam: డ్రెస్సింగ్‌రూంలో పాక్ ఆటగాళ్ల గొడవ.. బాబర్ ఆజం ప్రతీకారం!
Pakistan Players Babar Azam And Imam Clash In Dressing Room, Video Goes Viral: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన బాబర్ ఆజం బృందం.. తొలి టెస్టులో విజయం సాధించి జోష్‌లో ఉంది. అదే జోరును కొనసాగిస్తూ రెండో టెస్టు కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకొనేందుకు సిద్ధమైంది. ఇలా వరుస విజయాలు సాధించడం పట్ల పీసీబీ సంతోషంగా ఉంటే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు మాత్రం డ్రెస్సింగ్‌రూంలో ‘గొడవపడి’ గందరగోళం సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెండో టెస్టు మూడో రోజు ఆట వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో.. కెప్టెన్ బాబర్ ఆజం, ఇమామ్-ఉల్-హక్ డ్రెస్సింగ్ రూంలో క్రికెట్ ఆడారు. తొలుత బాబర్ బ్యాటింగ్ చేయగా.. ఇమామ్ అతడిని అవుట్ చేశాడు. ఇందుకు బాబర్ సైతం ధీటుగా బదులిచ్చాడు. ఇమామ్‌ను అవుట్ చేసి.. ప్రతీకారం తీర్చుకున్నాడు. అయితే, తాను అవుట్ కాలేదంటూ... ఇమామ్ వాదించాడు. ఈ క్రమంలో ఇద్దరూ సరదాగా వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆట కొనసాగింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. చదవండి: India Tour Of South Africa: టీమిండియాకు భారీ షాక్.. నలుగురు ఆటగాళ్లు దూరం! వాళ్లిద్దరికీ బంపర్ ఆఫర్! PAK Vs BAN: బ్యాటింగ్ అయిపోయింది.. ఇప్పుడు బౌలింగ్ చేస్తున్నావా బాబర్! Rain might have kept our boys off the field, but they had a gripping match of their own in the dressing room Babar Azam batted first, and had a cautious start pic.twitter.com/sDQkIojpWP — Pakistan Cricket (@TheRealPCB) December 5, 2021 Babar was on fire and according to him, he finished with a 10-for. He got Bilal Asif out thrice in slips (as Imam tells us) pic.twitter.com/DFTgat2yrt — Pakistan Cricket (@TheRealPCB) December 5, 2021 -
కోహ్లీ 'ఆ సలహా' వల్లే నేడు ఈ స్థాయికి: బాబర్ ఆజమ్
కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇచ్చిన ఆ సలహా వల్లే తన బ్యాటింగ్ ఈ స్థాయికి చేరిందని ప్రశంసలతో ముంచెత్తాడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్. నెట్స్‌లో సీరియస్‌గా ప్రాక్టీస్ చేయాలని కోహ్లి ఇచ్చిన సలహాతో తన ఆట చాలా మెరుగుపడిందని ఆయన వెల్లడించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో దుమ్మురేపుతున్న ఆజమ్.. ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లిని వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. సఫారీలతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా 103, 31, 94 పరుగులతో రాణించిన ఆజమ్.. ఆ సిరీస్‌లో 13 పాయింట్లు సాధించి, పాక్ సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన సందర్భంగా సహచర క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్‌తో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ చిట్ చాట్ సందర్భంగా కోహ్లి ఇచ్చిన సలహాను ఆజమ్ గుర్తు చేసుకున్నాడు. గతంలో నేను నెట్ ప్రాక్టీస్‌ను చాలా తేలికగా తీసుకునేవాడినని, ఆ తర్వాత కోహ్లి సలహా మేరకు ఆ అలవాటును మార్చుకున్నాని పేర్కొన్నాడు. నెట్ సెషన్స్ ఎంత ముఖ్యమో ఆ తరువాతే అర్థం చేసుకున్నానని, అక్కడ కష్టపడితేనే మైదానంలో సత్తా చాటగలమని గ్రహించానని వెల్లడించాడు. నెట్స్‌లో నిర్లక్ష్యపు షాట్లు ఆడకూడదని, నెట్ సెషన్స్‌ను కూడా మ్యాచ్‌లానే భావించాలని కోహ్లీ సూచించాడని తెలిపాడు. నెట్స్‌లో మన ప్రవర్తన ఎలా ఉంటే మ్యాచ్‌లో కూడా అలానే ఉంటుందని కోహ్లి చెప్పిన విషయాన్ని ఆజమ్ గుర్తు చేసుకున్నాడు. -
ఎఫైర్ల వివాదంలో పాక్ క్రికెటర్ క్షమాపణలు
కరాచీ: యువతులను మోసం చేశాడంటూ ఆన్లైన్లో స్క్రీన్ షాట్లతో సహా వార్తలు వ్యాపించిన ఘటనలో పాకిస్తాన్ క్రికెటర్ ఇమాముల్ హక్ ఎట్టకేలకు దిగివచ్చాడు. ఈ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సీరియస్‌గా దృష్టి సారించడంతో క్షమాపణలు తెలియజేశాడు. ఏదైతే జరిగిందో దానిపై ఇమాముల్ పశ్చాత్తాపం వ్యక్తం చేయడమే కాకుండా బోర్డు పెద్దలను క్షమాపణలు కోరాడని పీసీబీ ఎండీ వసీం ఖాన్ తెలిపారు. ‘ జాతీయ క్రికెట్ జట్టులో ఉంటూ ఈ తరహా వివాదం రావడం సరైంది కాదు. దీనిపై మేము ఇమామ్‌ను వివరణ కోరడంతో పాటు తీవ్రంగా మందలించాం. అయితే వెలుగుచూసిన వివాదంపై ఇమామ్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరాడు. సాధారణంగా వ్యక్తిగత విషయాల్లో మేము జోక్యం చేసుకోకూడదు. కానీ మా కాంట్రాక్ట్ ఆటగాళ్లు ఎంతో బాధ్యతతో ఉండాల్సి క్రమంలో ఇటువంటి వివాదాలు మంచిది కాదు. ఇది బోర్డు క్రమశిక్షణను ఉల్లఘించడమే. దాంతోనే ఇమామ్‌ను వివరణ కోరగా క్షమాపణలు తెలియజేశాడు. (ఇక్కడ చదవండి: ఎఫైర్ల వివాదంలో ఇమాముల్ హక్!) -
ఎఫైర్ల వివాదంలో ఇమాముల్ హక్!
కరాచీ: పాకిస్తాన్ క్రికెటర్ ఇమాముల్ హక్ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రేమ పేరుతో అనేక మంది యువతులను ఇమాముల్ హక్ మోసం చేశాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి సదరు యువతులతో ఇమాముల్ చాట్ చేసిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ తన స్టార్‌డమ్‌ని ఉపయోగించి అనేకమంది యువతుల్ని మోసం చేశాడని తెలుస్తోంది. తమని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరుతో వంచించాడని, వారితో శారీరక సంబంధాలు కూడా కొనసాగించాడని పేర్కొన్నాయి. గత ఐదారు నెలల్లోనే ఇవన్నీ జరిగాయని పేర్కొన్నాయి. అందుకు మరింత బలాన్ని చేకూరుస్తూ ఆ యువతులతో ఇమామ్ కొనసాగించిన ఛాటింగ్ విశేషాలు సైతం అనేక స్క్రీన్షాట్లు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచకప్‌లో ఇమామ్ మంచి ప్రదర్శన చేయలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత తలనొప్పిగా మారింది. ప్రధానంగా చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ఇంజమాముల్ హక్‌ను ఇమాముల్‌పై వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయి. ఇంజమామ్‌కు మేనల్లుడైన ఇమాముల్ వీటిపై ఎలా స్పందిస్తాడో చూడాలి. -
కనీసం 316 పరుగులతో గెలవాలి..అయితేనే!!
ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు చేరేందుకు శాయశక్తులా పోరాడతామని పాకిస్తాన్ క్రికెటర్ ఇమాముల్ హక్ పేర్కొన్నాడు. అదే విధంగా మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా సానుకూల దృక్పథంతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తామన్నాడు. కాగా ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై.. ఇంగ్లండ్ విజయం సాధించడంతో పాక్ సెమీస్ దారులు మూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మెగాటోర్నీలో నిలవాలంటే బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా పాక్ మొదట బ్యాటింగ్ చేయాలి. కనీసం 316 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించాలి. అలా అయితేనే అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే వన్డే చరిత్రలో ఇప్పటివరకు ఇంత భారీ తేడాతో ఏ జట్టూ గెలిచిన దాఖలాలు లేవు. ఒకవేళ బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేస్తే మాత్రం ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించడం లాంఛనమే. ఈ నేపథ్యంలో ఇమాముల్ హక్ మాట్లాడుతూ..‘ ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఓటమి నన్నెంతగానో నిరాశకు గురిచేసింది. ఆ మ్యాచ్‌లో నేను కుదురుగానే ఆడాను. నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ నిలకడగా ఆడుతూ మెగాటోర్నీలో అతి శక్తిమంతమైన జట్టును ఓడించాలని భావించాను. జట్టు కోసం మ్యాచ్ గెలవాల్సింది. కానీ అలా జరుగలేదు. నాపై జట్టు, అభిమానులు పెట్టుకున్న ఆశలు నిలబెట్టుకోలేకపోయాను. ఈ టోర్నీలో నాకు మంచి ఆరంభాలే లభించినా చివరికంటా పోరాడలేకపోయాను. అయితే నేను ఇంకా చిన్నవాడినే. ఈ ప్రపంచకప్‌లో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్నాను. భవిష్యత్తులో ఇవి నాకెంతగానో ఉపయోగపడతాయి. ఇక మేము సెమీస్ చేరనప్పటికీ సానుకూలంగానే టోర్నీ నుంచి నిష్ర్రమిస్తాం’ అని 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇమాముల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మెగాటోర్నీలో మొత్తంగా 205 పరుగులు చేసిన ఈ యువ ఆటగాడు జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక పాక్ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాతో ఆడనున్న విషయం తెలిసిందే. -
36 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు..
బ్రిస్టల్: పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 36 ఏళ్ల క్రితం భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ నెలకొల్పిన రికార్డును ఇమామ్ ఉల్ బద్ధలు కొట్టాడు. ఇంగ్లండ్‌లో అత్యంత పిన్న వయసులో 150కి పైగా వన్డే పరుగులు సాధించిన రికార్డును ఇమామ్ తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే ఇమామ్ ఉల్ హక్ 151 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఇంగ్లండ్ గడ్డపై 23 ఏళ్ల వయసులో ఈ ఫీట్ సాధించిన క్రీడాకారుడిగా ఇమామ్ గుర్తింపు పొందాడు. అంతకుముందు 1983 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన పోరులో కపిల్ దేవ్ 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. అప్పటికి అతడి వయసు 24 ఏళ్లు. దాదాపు 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు 23 ఏళ్ల ఇమామ్ ఇంగ్లండ్‌లో 150పైగా స్కోరు సాధించాడు. మూడో వన్డేలో ఇమామ్ 131 బంతుల్లో 16 బౌండరీలు, 1 సిక్సర్ సాయంతో 151 పరుగులు నమోదు చేశాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించాడు. అతడితో పాటు హ్యారిస్ సొహైల్ (41), అసిఫ్ అలీ (52) రాణించడంతో ఇంగ్లాండ్‌కు పాక్ 359 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. అయితే పాక్ ఆశలను ఇంగ్లండ్ నీరుగార్చింది. భారీ లక్ష్యాన్ని మరో 31 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఇంగ్లండ్ చిరస్మరణీయ విజయంలో జానీ బెయిర్‌స్టో (128; 93 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. అతడికి తోడుగా జాసన్ రాయ్ (76; 55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ముఖ్య భూమిక పోషించాడు.