PAk vs Aus 1st ODI: Australia Beat Pakistan by 88 Runs Travis Head Rises - Sakshi
Sakshi News home page

PAk Vs Aus 1st ODI: ట్రావిస్‌ హెడ్‌ మెరుపు శతకం.. పాక్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా

Published Wed, Mar 30 2022 8:00 AM | Last Updated on Wed, Mar 30 2022 4:24 PM

PAk Vs Aus 1st ODI: Australia Beat Pakistan By 88 Runs Travis Head Rises - Sakshi

Pakistan Vs Australia ODI Series 2022- లాహోర్‌: పాకిస్తాన్‌తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 88 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 313 పరుగులు సాధించింది.

ట్రావిస్‌ హెడ్‌ (72 బంతుల్లో 101; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు శతకం... బెన్‌ మెక్‌డెర్మట్‌ (55; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశారు. అనంతరం పాకిస్తాన్‌ 45.2 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (103; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), బాబర్‌ ఆజమ్‌ (57; 6 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement