Pak Vs Aus: ఆసీస్‌పై సంచలన విజయం.. పాకిస్తాన్‌ సరికొత్త రికార్డు! | Pak Vs Aus: Pakistan Beat Australia By 6 Wickets Highest Run Chase In ODIs | Sakshi
Sakshi News home page

Pak Vs Aus 2nd ODI: ఆసీస్‌పై సంచలన విజయం.. బాబర్‌ ఆజం బృందం సరికొత్త రికార్డు!

Published Fri, Apr 1 2022 7:52 AM | Last Updated on Fri, Apr 1 2022 8:08 AM

Pak Vs Aus: Pakistan Beat Australia By 6 Wickets Highest Run Chase In ODIs - Sakshi

Pakistan Vs Australia ODI Series 2022- లాహోర్‌: పాకిస్తాన్‌ జట్టు తమ వన్డే చరిత్రలో అతి పెద్ద లక్ష్యాన్ని ఛేదించింది. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాక్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా ఆసీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెన్‌ మెక్‌డెర్మట్‌ (108 బంతుల్లో 104; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించగా...ట్రవిస్‌ హెడ్‌ (70 బంతుల్లో 89; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), మార్నస్‌ లబ్‌షేన్‌ (49 బంతుల్లో 59; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

షాహిన్‌ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం పాక్‌ 49 ఓవర్లలో 4 వికెట్లకు 352 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (83 బంతుల్లో 114; 11 ఫోర్లు, 1 సిక్స్‌), ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (97 బంతుల్లో 106; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో చెలరేగగా, ఫఖర్‌ జమాన్‌ (64 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. తాజా ఫలితంతో సిరీస్‌ 1–1తో సమం కాగా, చివరి వన్డే శనివారం జరుగుతుంది.    

చదవండి: IPL 2022: కేఎల్‌ రాహుల్‌ ఎంత పని జరిగే.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement