![Imam ul Haq apologises for online scandal involving multiple women - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/30/Imamul1.jpg.webp?itok=nrLyWSOy)
కరాచీ: యువతులను మోసం చేశాడంటూ ఆన్‌లైన్‌లో స్క్రీన్ షాట్లతో సహా వార్తలు వ్యాపించిన ఘటనలో పాకిస్తాన్ క్రికెటర్ ఇమాముల్ హక్ ఎట్టకేలకు దిగివచ్చాడు. ఈ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సీరియస్‌గా దృష్టి సారించడంతో క్షమాపణలు తెలియజేశాడు. ఏదైతే జరిగిందో దానిపై ఇమాముల్ పశ్చాత్తాపం వ్యక్తం చేయడమే కాకుండా బోర్డు పెద్దలను క్షమాపణలు కోరాడని పీసీబీ ఎండీ వసీం ఖాన్ తెలిపారు.
‘ జాతీయ క్రికెట్ జట్టులో ఉంటూ ఈ తరహా వివాదం రావడం సరైంది కాదు. దీనిపై మేము ఇమామ్‌ను వివరణ కోరడంతో పాటు తీవ్రంగా మందలించాం. అయితే వెలుగుచూసిన వివాదంపై ఇమామ్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరాడు. సాధారణంగా వ్యక్తిగత విషయాల్లో మేము జోక్యం చేసుకోకూడదు. కానీ మా కాంట్రాక్ట్ ఆటగాళ్లు ఎంతో బాధ్యతతో ఉండాల్సి క్రమంలో ఇటువంటి వివాదాలు మంచిది కాదు. ఇది బోర్డు క్రమశిక్షణను ఉల్లఘించడమే. దాంతోనే ఇమామ్‌ను వివరణ కోరగా క్షమాపణలు తెలియజేశాడు. (ఇక్కడ చదవండి: ఎఫైర్ల వివాదంలో ఇమాముల్ హక్!)
Comments
Please login to add a commentAdd a comment