ACC Mens Emerging Teams Asia Cup 2023: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023 ఫైనల్లో పాకిస్తాన్ జట్టు అడుగుపెట్టింది. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో అతిథ్య శ్రీలంకను 60 పరుగులు తేడాతో చిత్తు చేసిన పాకిస్తాన్.. తుది పోరుకు అర్హత సాధించింది. 323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 45.4 ఓవర్లలో 262 పరుగులకే ఆలౌటైంది. పాకిస్తాన్ బౌలర్లలో ఆర్షద్ ఇక్భాల్ 5 వికెట్లతో చెలరేగగా.. ముబాసిర్ ఖాన్,సుఫియాన్ ముఖీమ్ తలా రెండు వికెట్లు సాధించారు.
శ్రీలంక బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో(97),సహన్ అరాచ్చిగే(97) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 322 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో ఒమర్ యూసఫ్(88), మహ్మద్ హారిస్(52), ముబాసిర్ ఖాన్(42) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.
ఆఖరిలో బౌలర్ మహ్మద్ వసీం(24) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో లహిరు సమరకోన్,ప్రమోద్ మదుషన్, కరుణ్ రత్నే తలా రెండు వికెట్లు సాధించగా.. వెల్లలగే, సహన్ అరాచ్చిగే చెరో వికెట్ పడగొట్టాడరు. ఇక జూన్ 23న కొలంబో వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో భారత్ లేదా బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ తలడపడనుంది.
చదవండి: IND vs WI: అయ్యో రోహిత్.. అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదుగా! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment