AFG VS PAK T20I: Abdullah Shafique 3 Consecutive Ducks In Four T20Is After Suryakumar Yadav - Sakshi
Sakshi News home page

PAK VS AFG 1st T20: వీడెవడ్రా సూర్యకుమార్‌ యాదవ్‌ కంటే మరీ అధ్వానంగా ఉన్నాడు..!

Published Sat, Mar 25 2023 12:08 PM | Last Updated on Sat, Mar 25 2023 1:29 PM

Abdullah Shafique Out On Zero Three T20s In A Row - Sakshi

షార్జా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్‌ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీ20ల్లో పాక్‌పై ఆఫ్ఘనిస్తాన్‌ గెలవడం ఇదే తొలిసారి. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. ఫజల్‌ హక్‌ ఫారూఖీ (4-0-13-2), ముజీబ్‌ (4-0-9-2), నబీ (3-0-12-2), అజ్మతుల్లా (3-0-20-1), నవీన్‌ ఉల్‌ హక్‌ (2-0-19-1), రషీద్‌ ఖాన్‌ (4-0-15-1) ధాటికి  నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేయగా.. ఆఫ్ఘనిస్తాన్‌ 17.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఫలితంగా రషీద్‌ ఖాన్‌ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మహ్మద్‌ నబీ (38 నాటౌట్‌), నజీబుల్లా జద్రాన్‌ (17 నాటౌట్‌) ఆఫ్ఘనిస్తాన్‌ను విజయతీరాలకు చేర్చగా.. పాక్‌ బౌలర్లలో ఇహసానుల్లా 2, నసీం షా, ఇమాద్‌ వసీం తలో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ 1-0 ఆధిక్యంలో వెళ్లింది. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. పాక్‌ వన్‌ డౌన్‌ బ్యాటర్‌ అబ్దుల్లా షఫీక్‌ వరుసగా 3 టీ20ల్లో డకౌటయ్యాడు. అదీ 3 మ్యాచ్‌ల్లో రెండో బంతికే ఔటయ్యాడు. షఫీక్‌.. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 తర్వాత షఫీక్‌ గణాంకాలు వైరల్‌ కావడంతో భారత అభిమానులు సూర్యకుమార్‌ యాదవ్‌ హ్యాట్రిక్‌ గోల్డన్‌ డకౌట్‌ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. స్కై కంటే ఈ షఫీక్ మరీ అధ్వానంగా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

సూర్యకుమార్‌ కనీసం బంతులు వేస్ట్‌ చేయకుండా ఔటయ్యాడు.. షఫీక్‌ ఏమో ఓ బంతి వేస్ట్‌ చేసి మరీ వికెట్‌ సమర్పించుకున్నాడంటూ చర్చించుకుంటున్నారు. సూర్యకుమార్‌ టీ20ల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడాక, వన్డేల్లో డకౌట్ల పరంపర మొదలుపెట్టాడు.. షఫీక్‌ ఆడింది 4 టీ20లే అయితే అందులో హ్యాట్రిక్‌ డకౌట్‌లు నమోదు చేశాడంటూ ఎద్దేవా చేస్తున్నారు. కాగా, ఇటీవల ఆసీస్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డేలో సిరీస్‌లో సూర్యకుమార్‌ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తొలి బంతికే ఔటైన విషయం తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement