మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ తమ పేలవ ఫీల్డింగ్ ప్రదర్శనను కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు క్యాచ్‌లు విడిచిపెట్టిన పాక్ స్టార్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఈజీ క్యాచ్‌ను జారవిడిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ కేవలం 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ క్రమంలో మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
అయితే పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ మాత్రం బౌలర్లను మారుస్తూ ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 15 ఓవర్ వేసేందుకు అమీర్ జమీల్ చేతికి బంతిని అందించాడు. ఆ ఓవర్‌లో తొలి బంతిని మార్ష్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. అయితే సెకెండ్ స్లిప్‌లో ఉన్న షఫీక్ ఈజీ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు.
అందుకు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోంది. 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మార్ష్.. ఏకంగా 96 పరుగులు చేశాడు. దీంతో షఫీక్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఆసీస్ దిగ్గజం మార్క్ వా సైతం ఆంసతృప్తి వ్యక్తం చేశాడు.
'మొసలి దవడలా క్యాచ్ పడుతున్నాడు.. వెంటనే అతడిని అక్కడ నుంచి తీసియేండి' అని అన్నాడు. అదే విధంగా ఓ సోషల్ మీడియా యూజర్ 'మరి నీవు మారవా? వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో పో' అంటూ ఓ పోస్ట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 57 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ప్రస్తుతం 230 పరుగుల అధిక్యంలో ఆసీస్ కొనసాగుతోంది.
చదవండి: IND vs SA: 'అతడిని టీమిండియా మిస్సవుతోంది.. సౌతాఫ్రికాకు చుక్కలు చూపించేవాడు'
Another drop by Pakistan.
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2023
Mark Waugh - it's like a crocodile jaw trying to catch a ball.pic.twitter.com/RAjkkanfzp
Comments
Please login to add a commentAdd a comment