అవకాశాలు సృష్టించుకోవడం ఎలాగో రాదు.. కనీసం! పాక్‌ చెత్త ఫీల్డింగ్‌ వల్లే.. | ICC ODI World Cup 2023, Pakistan Vs Australia: Shoaib Akhtar Slammed Pakistan Fielders For Dropping Catches - Sakshi
Sakshi News home page

Aus Vs Pak: అవకాశాలు సృష్టించుకోవడం ఎలాగో రాదు.. కనీసం: పాక్‌ ఆటగాళ్లపై అక్తర్‌ ఫైర్‌! ఈ వీడియో చూశారా?

Published Fri, Oct 20 2023 7:39 PM | Last Updated on Fri, Oct 20 2023 7:51 PM

WC 2023 Aus Vs Pak You Cant Drop: Akhtar on Pakistan Lethargic Fielding - Sakshi

ICC ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఫీల్డింగ్‌ తప్పిదాలపై ఆ జట్టు మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ మండిపడ్డాడు. అవకాశాలు సృష్టించుకోవడం ఎలాగో చేతకాదు.. కనీసం బ్యాటర్లు ఇచ్చిన ఛాన్స్‌ను కూడా వినియోగించుకోరా అంటూ ఘాటు విమర్శలు చేశాడు.

కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టాస్‌ గెలిచిన పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో ఆరంభం నుంచే ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ దూకుడుగా ఆడారు.

అయితే, ఐదో ఓవర్లోనే వార్నర్‌ను పెవిలియన్‌కు పంపే అవకాశం వచ్చింది. పాక్‌ స్టార్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది సంధించిన షార్ట్‌ బాల్‌ను వార్నర్‌ మిడాన్‌ దిశగా గాల్లోకి లేపగా.. ఉసామా మిర్‌ సింపుల్‌ క్యాచ్‌ అందుకోలేకపోయాడు.

అంతేకాదు.. 33వ ఓవర్లో మరోసారి వార్నర్‌ ఇచ్చిన అవకాశాన్ని కూడా పాక్‌ ఫీల్డర్లు ఉపయోగించుకోలేకపోయారు. ఉసామా మిర్‌ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ డీప్‌ దిశగా బాదగా.. అబ్దుల్లా షఫీక్‌ క్యాచ్‌ జారవిడిచాడు. 

ఈ నేపథ్యంలో.. ‘‘అవకాశాలు సృష్టించుకోవడం చేతకానపుడు.. కనీసం బ్యాటర్లు ఇచ్చిన అవకాశాలనైనా సద్వినియోగం చేసుకోవచ్చు కదా! ఇన్ని క్యాచ్‌లు డ్రాప్‌ చేయడం సరికాదు.. కమాన్‌ బాయ్స్‌’’ అంటూ షోయబ్‌ అక్తర్‌ పాక్‌ ఆటగాళ్లను విమర్శించాడు. కాగా పాక్‌ ఫీల్డర్ల తప్పిదాల కారణంగా రెండుసార్లు లైఫ్‌ పొందిన వార్నర్‌ మొత్తంగా 124 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 163 పరుగులు చేసి హ్యారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 

ఇక వార్నర్‌కు తోడుగా మరో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌(121) సెంచరీతో చెలరేగడంతో ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగుల భారీ స్కోరు సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement