వార్నర్ క్యాచ్‌ను వదిలేసిన ఫీల్డర్.. ఆఫ్రిది షాక్ (PC: cricket.com.au)
Australia vs Pakistan, 2nd Test Day 1: ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు ఆరంభమైంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పర్యాటక పాక్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
కెప్టెన్ షాన్ మసూద్ నమ్మకాన్ని నిలబెడుతూ పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను 38 పరుగులకే పరిమితం చేశారు.
వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్ వదిలేశాడు
నిజానికి మూడో ఓవర్ ఆఖరి బంతికే అతడు అవుట్ కావాల్సింది. కానీ అబ్దుల్లా షఫీక్ చేసిన పొరపాటు వల్ల వార్నర్‌కు లైఫ్ లభించింది. షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను షఫీక్ జారవిడిచాడు. అప్పటికి ఈ ఓపెనింగ్ బ్యాటర్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు.
అయితే, షషీక్ పొరపాటు వల్ల బతికిపోయిన వార్నర్‌ను పాక్ స్పిన్నర్ ఆఘా సల్మాన్ పెవిలియన్‌కు పంపాడు. 28వ ఓవర్ మొదటి బంతికి సల్మాన్ బౌలింగ్‌లో.. ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి వార్నర్ వెనుదిరిగాడు.
David Warner gets a life on two! Shaheen Afridi gets the ball swinging and Abdullah Shafique puts it down at first slip #AUSvPAK pic.twitter.com/EJc4AptxJk
— cricket.com.au (@cricketcomau) December 25, 2023
ఖవాజాను అవుట్ చేసిన హసన్ అలీ
ఇక మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(101 బంతుల్లో 42 పరుగులు)ను పేసర్ హసన్ అలీ అద్భుత బంతితో అవుట్ చేశాడు. 33.1 ఓవర్ వద్ద అఘా సల్మాన్ అందుకున్న క్యాచ్‌తో ఖవాజా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ప్రస్తుతం మార్నస్ లబుషేన్ 14, స్టీవ్ స్మిత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆటకు వర్షం అంతరాయం
కాగా ఆసీస్- పాక్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి ఆస్ట్రేలియా 42.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.
అప్పుడు ఖవాజా.. ఇప్పుడు వార్నర్
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ బృందం ఏకంగా 360 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది.
ఇక ఈ మ్యాచ్‌లోనూ ఖవాజా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను షఫీక్ జారవిడిచిన విషయం తెలిసిందే. తాజాగా రెండో టెస్టులోనూ తప్పిదాన్ని పునరావృతం చేశాడు. అయితే, ఈసారి వార్నర్ క్యాచ్‌ను వదిలేశాడు. దీంతో అతడిపై నెట్టింట మరోసారి ట్రోల్స్ మొదలయ్యాయి.
చదవండి: IPL 2024: పాండ్యా కోసం రూ. 100 కోట్లు చెల్లించిన ముంబై? బంగారు బాతు కదా!
Comments
Please login to add a commentAdd a comment