ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ అనంతరం పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా పాక్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో ఆసీస్‌తో తలపడనుంది. ఈ వైట్‌బాల్ సిరీస్‌ల కోసం పాక్ సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో తమ జట్టును ప్రకటించే అవకాశముంది. నవంబర్ 4న మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో పాక్ పర్యటన ప్రారంభం కానుంది.
ఫఖార్ జమాన్‌పై వేటు?
ఇక ఇది ఇలా ఉండగా.. స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్‌పై పాక్ సెలక్షన్ కమిటీ వేటు వేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను నుంచి పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను అర్ధంతరంగా తప్పించడాన్ని జమాన్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. సెలక్టర్ల తీరుపై ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించాడు.
భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ అతడు హితువు పలికాడు. దీంతో అతడిపై పీసీబీ సీరియస్ అయింది. ఇప్పటికే అతడికి పాక్ క్రికెట్ బోర్డు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. అంతటితో ఆగకుండా ఆసీస్ టూర్‌కు జమాన్‌ను ఎంపిక చేయకూడని పాక్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా జమాన్ ఇటీవల నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో కూడా ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. మోకాలి సమస్యలతో బాధపడుతున్న 34 ఏళ్ల జమాన్.. ఎనిమిది నిమిషాల్లో రెండు కిలోమీటర్ల పరుగును పూర్తి చేయడంలో విఫలమైనట్లు సమాచారం. ఆసీస్ టూర్‌కు జమాన్ వెళ్తాడా లేదా అన్నది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment