రెండున్నర గంటల్లో 4.5 కేజీలు తగ్గిన క్రికెటర్‌ | Peter Handscomb lost 4.5 kilograms while battling heat | Sakshi
Sakshi News home page

రెండున్నర గంటల్లో 4.5 కేజీలు తగ్గిన క్రికెటర్‌

Published Fri, Sep 8 2017 10:53 PM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM

రెండున్నర గంటల్లో 4.5 కేజీలు తగ్గిన క్రికెటర్‌

రెండున్నర గంటల్లో 4.5 కేజీలు తగ్గిన క్రికెటర్‌

సాక్షి, హైదరాబాద్‌: భారీ కాయస్తులు బరువు తగ్గడానికి చేయని ప్రయత్నం ఉండదు. నెలల తరబడి శిక్షణ తీసుకుంటూ ఉంటారు. టీవీల్ల వచ్చే ప్రకటనలను అనుసరిస్తారు. జిమ్‌లకు వెళ్తారు, ఎక్సర్‌సైజ్‌లు చేస్తారు. గ్రౌండ్‌లో పరుగులు తీస్తారు. అయినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ ఓ క్రికెటర్‌ మాత్రం ఒక్కరోజులోనే ఏకంగా 4.5 కేజీల బరువు తగ్గాడు.

వివరాల్లోకి వెళ్తే ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్‌ పీటర్‌ హ్యాండ్స్‌కంబ్‌ చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో రెండో రోజు బ్యాటింగ్‌ చేశాడు. రెండున్నర గంట క్రీజులో ఉన్న పీటర్‌ 113 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఆరోజు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఆటగాళ్లు గ్రౌండ్‌లో చెమట చిందించారు.  అలాగే ఈ రెండున్నర గంటల్లో ఏకంగా 4.5 కేజీల బరువు తగ్గాడు. దీంతో ఇతర ఆటగాళ్లు పీటర్‌ మీద జోకులు పేలుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement