
ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్.. వివాదస్పద క్రికెటర్ టిమ్ పెయిన్ మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగు పెడుతున్నాడు. 2017లో ఒక మహిళకు అసభ్యకర సందేశాలు పంపిన వివాదం వెలుగులోకి రావడంతో గత ఏడాది నవంబర్‌లో ఆసీస్ టెస్టు కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయడంతో పాటు ఆటనుంచి కూడా అతను విరామం తీసుకున్నాడు.
ఇప్పుడు తాజాగా తన దేశవాళీ జట్టు టాస్మేనియా ప్రాక్టీస్ సెషన్‌లో అతను కూడా పాల్గొన్నాడు. అక్టోబర్ 6 నుంచి జరిగే షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో పెయిన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. టిమ్ పైన్ ఆసీస్ తరపున 35 టెస్టుల్లో 1534 పరుగులు, 35 వన్డేల్లో 890 పరుగులు, 12 టి20ల్లో 82 పరుగులు సాధించాడు.