Ind Vs Aus: Ravindra Jadeja Rubbing His Bowling Finger With Suspicious Material, Video Viral - Sakshi
Sakshi News home page

Ravindra Jadeja: 'జడేజా చీటింగ్‌ చేశాడా'.. చూసి మాట్లాడండి!

Published Thu, Feb 9 2023 9:59 PM | Last Updated on Fri, Feb 10 2023 9:19 AM

Footage Ravindra Jadeja Rubbing Bowling Finger Suspicious Material Viral - Sakshi

దాదాపు ఐదు నెలల విరామం తర్వాత మైదానంలో అడుగుపెట్టిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో మొదలైన తొలి టెస్టులో జడేజా ఐదు వికెట్లు తీసి రీఎంట్రీలో అదుర్స్‌ అనిపించాడు. మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, మాట్‌ రెన్‌షా, పీటర్‌ హ్యాండ్స్‌కోబ్‌, టాడ్‌ మార్ఫే రూపంలో ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించాడు. జడేజాకు టెస్టుల్లో ఐదు వికెట్ల హాల్‌ అందుకోవడం ఇది 11వ సారి.

ఈ విషయం పక్కనబెడితే.. జడేజా చేసిన ఒక పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ వేసేందుకు జడ్డూ సిద్ధమయ్యాడు. అప్పటికే జడేజా 30 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. క్రీజులో అలెక్స్‌ క్యారీ, హ్యాండ్స్‌కోబ్‌ ఉన్నారు. అయితే బౌలింగ్‌ వేయడానికి ముందు సిరాజ్‌ వద్దకు వెళ్లిన జడ్డూ అతని చేతిపై నుంచి ఏదో తీసుకున్నాడు. దానిని తాను బౌలింగ్‌ చేస్తున్న చేతికి రాశాడు. ఏం చేశాడన్నది క్లారిటీ లేదు కానీ వీడియో చూస్తే తన వేలికి ఏదైనా లోషన్‌ రాసుకొని ఉంటాడనిపిస్తుంది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా వైరల్‌గా మారింది. అయితే జడేజా తీరుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ఆసక్తికరంగా స్పందించాడు. గ్రిప్పింగ్‌ కోసం జడేజా చేసిన పనిపై నువ్వేమంటావని టిమ్‌ పైన్‌ని అడగ్గా..'' ఇంట్రెస్టింగ్‌'' అని కామెంట్‌ చేశాడు. మరికొందరు..జడేజా ఏమైనా చీటింగ్‌ చేశాడా'' అంటూ కామెంట్‌ చేయగా.. కొందరు మాత్రం ''అలాంటి చెత్త పనులు చేయాల్సిన అవసరం జడ్డూకు లేదని.. అది కేవలం లోషన్‌ మాత్రమేనని.. చూసి మాట్లాడండి'' అంటూ జడ్డూకు మద్దతు పలికారు. ఏది ఏమైనా జడేజా తన చర్యతో అందరి చూపు తన వైపుకు తిప్పుకున్నాడు.

చదవండి: అశ్విన్‌దే కాదు షమీది కూడా రికార్డే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement