Shane Warne Death: Cricket Fraternity Reactions, Tributes Pour In - Sakshi
Sakshi News home page

ప్రపంచ క్రికెట్‌లో విషాదం.. షేన్‌వార్న్‌ మృతి, సంతాపాల వెల్లువ..

Published Fri, Mar 4 2022 9:50 PM | Last Updated on Sat, Mar 5 2022 8:40 AM

Shane Warne 52 Sudden Death Cricket Fraternity Reactions Tributes Pour In - Sakshi

ప్రపంచ క్రికెట్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ శుక్రవారం హఠాన్మరణం చెందారు. థాయ్‌లాండ్‌లోని ఓ విల్లాలో విగతజీవిగా కనిపించారు. ఆయన మృతిని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. గుండెపోటుతోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వెలువడుతున్నాయి. 

ఇక వార్న్‌ మృతిపట్ల యావత్‌ క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. తమ అభిమాన సహచరుడు లేడనే వార్త విని క్రికెట్‌ ప్రముఖులు విషాదంలో మునిగారు. వార్న్‌ కుటుంబానికి ఈ కష్ట కాలంలో ధైర్యాన్ని ప్రసాదించాలని దేవున్ని ప్రార్థించారు. ఈమేరకు సోషల్‌ మీడియా వేదికగా పలువురు స్పందించారు.

‘షేన్‌ వార్న్‌ మృతి విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. మాటలు రావడం లేదు. క్రికెట్‌ ప్రపంచంలో లెజెండ్‌. ఆటలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి. ఇంత త్వరగా కాలం చేయడం విషాదకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’ అని వీవీఎస్‌ లక్ష్మణ్‌ సంతాపం తెలిపారు.

‘అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. కూల్‌ స్పిన్‌కు వార్న్‌ పెట్టింది పేరు.. సూపర్‌ స్టార్‌ షేన్‌వార్న్‌ ఇకలేరనే విషయం బాధాకరం. మనిషి జీవితంలో ఎప్పుడేమవుతుందో చెప్పలేం. జీవితాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వార్న్‌ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి’ అని వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విటర్‌లో సంతాపం తెలిపారు.

‘క్రికెట్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ మృతి చెందారనే విధ్వంసకర వార్త విన్నా. నోట మాట రావడం లేదు. షాకింగ్‌గా ఉంది. గొప్ప ఆటగాడు, మంచి మనిషి’ అని పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ట్వీట్‌ చేశారు.

హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేసిన షమీ.. షేన్‌ వార్న్‌కు నివాళి అర్పించాడు.

‘షేన్‌వార్న్‌ ఇక లేరనే వార్త నమ్మలేకపోతున్నా.. ఇది అబద్ధమని చెప్పండి’ అని దినేష్‌ కార్తీక్‌ విస్మయం వ్యక్తం చేశాడు.

ఒకే రోజు ఇద్దరు దిగ్గజాలు కన్నుమూయడం విషాదకరం. మార్ష్‌, వార్న్‌ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అని డేవిడ్‌ వార్నర్‌ ట్వీట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement