ఆస్ట్రేలియన్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఒక ఇంటివాడయ్యాడు. 34 ఏళ్ల లియాన్.. తన చిన్ననాటి గర్ల్‌ఫ్రెండ్ ఎమ్మా మెక్‌కార్తీని పెళ్లాడాడు. ఐదేళ్లుగా ఎమ్మాతో డేటింగ్‌లో ఉన్న లియాన్ ఘాటైన ప్రేమలో మునిగి తేలుతున్నాడు. తాజాగా ఆదివారం సాయంత్రం బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యింది. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాథన్ లియాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు.
వాస్తవానికి గతేడాది లియాన్.. గర్ల్‌ఫ్రెండ్ ఎమ్మాకు డైమండ్ రింగ్ తొడిగి ఎంగేజ్‌మెంట్ చేసుకొని రూమర్లకు తెరదించాడు. కాగా నాథన్ లియాన్ ఇది వరకే మెల్ వారింగ్‌తో వివాహం కాగా.. ఐదేళ్ల క్రితమే విడిపోయారు. లియాన్- మెల్ వారింగ్ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం.
ఇక ఆఫ్ స్పిన్నర్ అయిన నాథన్ లియాన్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్‌లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే లంకతో టెస్టు సిరీస్ ద్వారా 438వ వికెట్ సాధించిన లియాన్ అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో టాప్-10లోకి ఎంటరయ్యాడు. ఇక లియాన్ ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు(తొలి రెండు స్థానాల్లో షేన్ వార్న్ 708 వికెట్లు, గ్లెన్ మెక్‌గ్రాత్ 563 వికెట్లు).
కాగా 2011లో శ్రీలంకతో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నాథన్ లియాన్ ఆసీస్ తరపున 110 టెస్టుల్లో 438 వికెట్లు, 29 వన్డేల్లో 29 వికెట్లు పడగొట్టాడు. ఇక టెస్టుల్లో లియాన్ 20 సార్లు ఐదు వికెట్ల హాల్... మూడుసార్లు 10 వికెట్ల హాల్ అందుకున్నాడు.
చదవండి: మగ బిడ్డకు జన్మనిచ్చిన కృనాల్ పాండ్యా భార్య పంఖురి శర్మ
Comments
Please login to add a commentAdd a comment