ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తన ప్రియురాలు బెక్కి బోస్టన్‌ను శనివారం జూలై 30న ఘనంగా వివాహం చేసుకున్నాడు. 2013లో తొలిసారి పరిచయం అయిన వీరిద్దరు అప్పటినుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 2020లో ఎంగేజ్ చేసుకున్న ఈ జంట 2021 అక్టోబర్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. కాగా పిల్లాడు పుట్టి తొమ్మిది నెలలకు కమిన్స్, బెక్కి బోస్టన్‌లు కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో ఒక్కటయ్యారు.
కమిన్స్ వైట్‌సూట్, బ్లాక్ ప్యాంట్.. బెక్కి బోస్టన్ తెల్ల గౌనులో అదిరిపోయే లుక్స్‌తో మెరిశారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా కమిన్స్ వివాహ వేడుకకు కమిన్స్ క్లోజ్ ఫ్రెండ్ కమెడియన్ ఆండీ లీతో పాటు క్రికెటర్లు నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్, ఆండ్రూ మెక్‌డొనాల్డ్, జోష్ హాజిల్‌వుడ్ తదితరులు హాజరయ్యారు. కాగా పాట్ కమిన్స్, బెక్కి బోస్టన్‌ల ముద్దుల తనయుడు అల్బీ వేడుకకు స్పెషల్ అట్రాక్షన్.
ప్రేమకు ఎలాంటి సరిహద్దులు ఉండవని ఈ ఇద్దరు నిరూపించారు. ఎందుకంటే కమిన్స్‌ను ఆస్ట్రేలియా అయితే.. బెక్కి బోస్టన్‌ది ఇంగ్లండ్. క్రికెట్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు చిరకాల ప్రత్యర్థులు. అయితే కమిన్స్, బోస్టన్‌ల ప్రేమ మాత్రం ఖండాలను దాటి వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక పాట్ కమిన్స్ 2011లో 18 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు కమిన్స్ 43 టెస్టుల్లో 199 వికెట్లు, 73 వన్డేల్లో 119 వికెట్లు, 39 టి20ల్లో 44 వికెట్లు తీశాడు. టిమ్ పైన్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కమిన్స్ ఆసీస్ టెస్టు జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు.
చదవండి: BAN VS ZIM 1st T20: సికందర్ రాజా ఊచకోత.. బంగ్లాకు షాకిచ్చిన జింబాబ్వే
Comments
Please login to add a commentAdd a comment