
టీమిండియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు బుధవారం భారత్‌కు బయలుదేరనుంది. అయితే ఆసీస్ టెస్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా మాత్రం ఒకరోజు ఆలస్యంగా వెళ్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) పేర్కొంది. వీసా సమస్యే అందుకు కారణమని సీఏ తెలిపింది.
''ఆస్ట్రేలియా జట్టులో ఉన్న అందరికి వీసాలు మంజూరు అయ్యాయని.. ఉస్మాన్ ఖవాజాకు మాత్రం వీసా ప్రాబ్లమ్ ఏర్పడింది. బుధవారం సాయంత్రం వరకు అది పరిష్కారమవుతుంది. ఈరోజు సాయంత్రంలోగా ఖవాజాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తామని.. గురువారం ఉదయం కొంతమంది సహాయక సిబ్బందితో కలిసి భారత్‌కు వెళ్తాడని'' క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డుకు చెందిన అధికారి ఒకరు పేర్కొన్నారు.
అయితే తాను ఫ్లైట్ మిస్సయిన విషయాన్ని ఖవాజా ఒక పాపులర్ మీమ్‌తో సరదాగా ట్విటర్‌లో పంచుకున్నాడు. భారతీయ వీసా కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నట్లుగా నా పరిస్థితి తయారూంది. అంటూ పేర్కొన్నాడు.ఇక టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. టెస్టు సిరీస్ అనంతరం ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా జరగనుంది.
ఈ టెస్టు సిరీస్ టీమిండియాకు కీలకం కానుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలిస్తే టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్ ఉంటుంది.
Me waiting for my Indian Visa like... #stranded #dontleaveme #standard #anytimenow https://t.co/pCGfagDyC1
— Usman Khawaja (@Uz_Khawaja) February 1, 2023
చదవండి: నెగెటివ్ ట్వీట్‌ను లైక్ చేసిన క్రికెటర్.. కోపాన్ని చెప్పకనే చెప్పాడు