
India vs Australia, 4th Test- Usman Khawaja: ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాకు ఈసారి భారత పర్యటన అతడి కెరీర్‌లోనే చిరస్మరణీయంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. గతంలో రెండుసార్లు ఇక్కడికి వచ్చిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం డ్రింక్స్ అందించేందుకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 ఆరంభానికి ముందే తుదిజట్టులో చోటు ఖాయం కాబట్టి.. తనదైన మార్కు చూపించాలని ఆరాటపడ్డాడు.
అయితే, మొదటి టెస్టులో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయిన ఖవాజా.. రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులకే పరిమితమయ్యాడు. ఢిల్లీ టెస్టుతో పుంజుకున్న అతడు.. మొత్తంగా 87 పరుగులు సాధించాడు. ఇక ఇండోర్ టెస్టులో 60 పరుగులతో సత్తా చాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక సిరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఉస్మాన్ ఖవాజా మరోసారి బ్యాట్ ఝులిపించాడు. అయితే, ఈసారి ఏకంగా సెంచరీ బాది జట్టును పటిష్టస్థితిలో నిలిపాడు. పట్టుదలగా నిలబడి 422 బంతులు ఎదుర్కొని 180 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఖవాజా అరుదైన ఘనత సాధించాడు.
స్మిత్ రికార్డు బద్దలు
అహ్మదాబాద్ టెస్టులో 180 పరుగులు సాధించిన ఖవాజా భారత గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన మూడో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో స్మిత్‌ను వెనక్కినెట్టాడు.
భారత్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆసీస్ బ్యాటర్లు
1. డీన్ జోన్స్- 1986- చెన్నైలో- 210
2. మాథ్యూ హెడెన్-2001- చెన్నైలో- 203
3. ఉస్మాన్ ఖవాజా- 2023- అహ్మదాబాద్-180
4. స్టీవ్ స్మిత్- 2017- రాంచిలో- 178 నాటౌట్.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత బౌలర్‌గా! దరిదాపుల్లో ఎవరూ లేరు
Ind Vs Aus: కోహ్లి కెప్టెన్సీలో ఏడేళ్లలో రెండుసార్లు! రోహిత్ సారథ్యంలో 24 గంటల్లోనే రెండుసార్లు! ఇంత ఘోరమా?
23 ఏళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా.. అంతా వాళ్ల వల్లే! అదే జరిగితే టీమిండియా..