Aneel Neupane
-
ఆ సినిమాను యూట్యూబ్ లో చూడలేరు!
ముంబై: మనోజ్ బాజపేయి, రాధిక ఆప్టే నటించిన షార్ట్ ఫిలిమ్ 'కృతి' యూట్యూబ్ నుంచి తొలగించారు. కాపీ రైట్ వివాదం తలెత్తడంతో ఈ సినిమాను యూట్యూబ్ తొలగించింది. ఈ విషయాన్ని దర్శకుడు శిరీష్ కుందర్ ధ్రువీకరించారు. యూట్యూబ్ నుంచి తమ సినిమాను తొలగించారని ట్వీట్ చేశారు. తమకు మద్దతుగా నిలిచినందుకు ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 'కృతి' షార్ట్ ఫిలిమ్ ను యూట్యూబ్ లో 25 లక్షల మంది వీక్షించారు. 18 నిమిషాల నిడివున్న ఈ సినిమాను యూట్యూబ్ లో జూన్ 22న విడుదల చేశారు. తన షార్ట్ ఫిలిమ్ 'బాబ్'ను కాపీ కొట్టి 'కృతి' తీశారని నేపాల్ దర్శకుడు అనీల్ న్యుపనె ఆరోపించడంతో వివాదం రేగింది. 'కృతి' కంటే ఏడు నెలల ముందే 'బాబ్' తీశానని వెల్లడించాడు. అనీల్ న్యుపనె ఆరోపణలను శిరీష్ తోసిపుచ్చాడు. తనపై ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అతడికి లీగల్ నోటీసు పంపాడు. -
దర్శకుడికి లీగల్ నోటీసు
ముంబై: నేపాల్ దర్శకుడు అనీల్ న్యుపనెకు 'కృతి' షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ శిరీష్ కుందర్ లీగల్ నోటీసు ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు బేషరతుగా లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకముందు ఎటువంటి కామెంట్స్ చేయరాదని హెచ్చరించారు. 'కృతి' బాగుదంటూ సోషల్ మీడియాలో ప్రముఖులు ప్రశంసించారు. అయితే తన షార్ట్ ఫిలిమ్ 'బాబ్'ను కాపీ కొట్టి 'కృతి' తీశారని అనీల్ న్యుపనె ఆరోపించాడు. దీంతో స్పందించిన శిరీష్ తన లాయర్ ద్వారా లీగల్ నోటీసు పంపాడు. తమ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తైందని, జూన్ 22న యూట్యూబ్ లో విడుదల చేశామని శిరీష్ తెలిపాడు. 'బాబ్' షార్ట్ ఫిలిమ్ మే 12న యూట్యూబ్ లో పెట్టారని వెల్లడించారు. రెండు సినిమాలకు సారూప్యత ఉన్నంత మాత్రానా కాపీ కొట్టారని ఆరోపణలు సమంజసం కాదని పేర్కొన్నారు. 'కృతి' సినిమా బాగుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు.