టాప్ వీడియో షేరింగ్ సైట్ గా ఫేస్ బుక్!
న్యూయార్క్: వీడియో షేరింగ్ లో ప్రపంచ నెంబర్-1గా ఉన్న యూ ట్యూబ్ ను ఫేస్ బుక్ తలదన్నే రోజు దగ్గర్లోనే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది పాటు 20 వేల ఫేస్ బుక్ పేజీలు,1.8 లక్షల పోస్టులను పరిశీలించి మరీ వీరు జోస్యం చెబుతున్నారు. ' కంటెంట్ మార్కెట్ చేసేవారు నేరుగా తమ వీడియోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తున్నారు.దీంతో ఫేస్ బుక్ అధిక సంఖ్యలో యూజర్లను నిలబెట్టుకోగలుగుతోంది.యూజర్లు ఫేస్ బుక్ ను విడిచి వెళ్లకుండా అలానే ఉండేందుకు ఇది తోడ్పడుతోంది'అని సోషల్ బేకర్స్ అనే సోషల్ మీడియా విశ్లేషణ కంపెనీ తన వెబ్ సైట్ లో పేర్కొంది.
ఇదిలా ఉండగా రోజూ 100 కోట్ల(బిలియన్) వీడియోలను అప్ లోడ్ చేస్తున్నట్లు గత సెప్టెంబర్ లో ఫేస్ బుక్ ప్రకటించడం కూడా ఇందుకు బలం చేకూర్చుతోంది.