జస్ట్‌ ఫిట్‌ నెస్‌ చానెల్‌తో..ఏకంగా రూ. 700 కోట్లు..! | Fit Tuber: Vivek Mittal Popular Fitness YouTuber | Sakshi
Sakshi News home page

జస్ట్‌ ఫిట్‌ నెస్‌ చానెల్‌తో..ఏకంగా రూ. 700 కోట్లు ఆర్జిస్తున్న యూట్యూబర్‌!

Published Mon, Dec 25 2023 4:17 PM | Last Updated on Tue, Dec 26 2023 9:41 AM

Fit Tuber Vivek Mittal Popular Fitness Youtuber - Sakshi

హెల్త్, డైట్, ఫిట్‌నెస్‌కి సంబంధించి ‘ఫిట్‌ ట్యూబర్‌’ పేరుతో యూట్యూబ్‌లో ఒక చానెల్‌ స్టార్ట్‌ చేసిండు. తక్కువ సమయంలోనే అతని వీడియోలు జనాలకు రీచ్‌ అవ్వడం, ఆదరణ లభించడం రెండూ ఒకేసారి జరిగాయి. దీంతో ఒక్కసారిగా మంచి పేరు వచ్చింది.  అక్కడితో ఆగలేదు. ఇతని చానెల్‌కి దాదాపు 6 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారంటే అంతని వీడియోలకు మస్త్‌ క్రేజ్‌ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ యూట్యూబ్‌ ఛానెల్‌తో అతను దగ్గర దగ్గర దాదాపు 750 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఇతని పేరు వివేక్‌ మిత్తల్‌. సొంతూరు పంజాబ్‌లోని బఠిండా. బీటెక్‌ పూర్తిచేసి ఇన్ఫోసిస్‌లో జాబ్‌ కూడా చేశాడు. తర్వాత 2016లో యూట్యూబ్‌ జర్నీ స్టార్ట్‌ చేశాడు. అయితే ఇతని యూట్యూబ్‌కి ఉన్న ఇన్‌ఫ్లయోన్స్‌ చూసి తెలంగాణ గవర్నమెంట్‌ రాష్ట్రీయా గౌరవ్‌ అవార్డుతో సన్మానించింది. మీక్కూడా ఇలానే ఏమన్నా టాలంఎంటు ఉంంటే సీరియస్‌ తీసుకుని సక్కగా వీడియోలు తీసుకుని క్రేజ్‌ సంపాదించుకుండి. అటోమేటిగ్గా పేరుకి పేరు డబ్బులకు డబ్బులు సంపాదించుకోవచ్చు. 

(చదవండి: భారత్‌లో ఫస్ట్‌ క్రిస్మస్‌ కేక్‌ ఎక్కడ తయారయ్యిందో తెలుసా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement