YouTuber Deena Commits Suicide In Hyderabad Due To Viewers Not Increasing For Channel - Sakshi
Sakshi News home page

Youtuber Deena Suicide: హైదరాబాద్‌లో యూట్యూబర్‌ ఆత్మహత్య

Published Thu, Jul 21 2022 3:07 PM | Last Updated on Thu, Jul 21 2022 3:41 PM

YouTuber Commits Suicide In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైదాబాద్‌ క్రాంతినగర్‌లో యూట్యూబర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూట్యూబ్‌లో వ్యూస్‌ పెరగడం లేదంటూ డ్రిపెషన్‌తో డీనా అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ గ్వాలియర్‌లో డీనా ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. గేమ్‌ ఆడుతూ తన బాధను చెప్పుకున్న డీనా.. ఆ క్రమంలో ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించాడు.
చదవండి: నిత్యపెళ్లికొడుకు మామూలోడు కాదు.. 13 మందిని పెళ్లి చేసుకొని..

యూట్యూబ్‌లో selflo గేమ్‌ ఛానెల్‌ను అతను నిర్వహిస్తున్నాడు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు 8 గంటల ముందే సూసైడ్ లెటర్‌ను డీనా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. డీనా తండ్రి రైల్వేలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లి డీఆర్‌డీవోలో పనిచేస్తున్నట్టుగా సమాచారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement