ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ హోంటూర్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పటికే మంచు లక్ష్మీ, కమెడియన్ అలీ,కృష్ణం రాజు వంటి ప్రముఖుల హోంటూర్స్ నెట్టింట ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరో సెలబ్రిటీ హోంటూర్ కూడా వచ్చేసింది. ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ హోంటూర్ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తుంది.
ఆయన కుమార్తె మంజుల ఘట్టమనేని స్వయంగా తన యూట్యూబ్ చానెల్‌లో హోంటూర్‌కు సంబంధించిన ప్రోమో వీడియోను రిలీజ్ చేసింది. సకల సైకర్యాలతో అందమైన హంగులతో ఇంద్రభవనాన్ని తలపిస్తున్నట్లు ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. విజయ నిర్మల విగ్రహం ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. త్వరలోనే ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వీడియో రానుంది.
Comments
Please login to add a commentAdd a comment