ముంబైలో మంచు లక్ష్మీ కొత్త ఇల్లు.. వీడియో చూశారా? | Manchu Lakshmi New Home In Mumbai, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Manchu Lakshmi Mumbai Home Video: మంచు లక్ష్మీ ముంబై హోమ్ టూర్ వీడియో

Published Sat, Apr 13 2024 9:26 AM | Last Updated on Sat, Apr 13 2024 10:11 AM

Manchu Lakshmi New Home In Mumbai Video Viral - Sakshi

మంచు ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్ బాబు దగ్గర నుంచి మంచు లక్ష్మీ వరకు అందరూ సినిమాల్లో నటించారు. నటిస్తూనే ఉన్నారు. అలానే ఎప్పుడూ ఏదో ఓ విషయమై సోషల్ మీడియాలో ఉంటూనే ఉంటారు. అలా ఇప్పుడు మంచు లక్ష్మీ చర్చల్లోకి వచ్చింది. ముంబైలో కొత్త ఇల్లు కొనడమే దీనికి కారణం.

తండ్రి మోహన్ బాబు అడుగుజాడల్లో ఇండస్ట్రీలోకి వచ్చిన మంచు లక్ష్మీ.. తొలుత నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. 'అనఅనగా ఓ ధీరుడు' అనే సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. హీరోయిన్, సహాయ పాత్రల్లో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె నటించిన 'ఆదిపర్వం' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

(ఇదీ చదవండి: నేను అనుకున్న కలని అతడు నిజం చేశాడు: చిరంజీవి)

సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పటికే తండ్రి మోహన్ బాబు ఇంటిని, హైదరాబాద్ తన ఇంటిని హోమ్ టూర్స్ చేసిన మంచు లక్ష్మీ.. ఇప్పుడు ముంబైలో తను కొత్తగా తీసుకున్న ఇంటి టూర్ వీడియో కూడా చేసింది. ఇది పర్మినెంట్ ఫ్లాట్ కాదని చెప్పింది. చాలావరకు హైదరాబాద్ నుంచి తనకు నచ్చిన, కావాల్సిన వస్తువుల్ని తెచ్చేసుకున్నానని చెప్పుకొచ్చింది. తాను ఇప్పటికే చేసిన హోమ్ టూర్  వీడియోలకు మంచి స్పందన వచ్చిందని, అందుకే ఇప్పుడు ఈ హోమ్ టూర్ వీడియో కూడా చేశానని క్లారిటీ ఇచ్చింది.

అయితే షూటింగ్స్ కోసం అప్పుడప్పుడు ముంబై వెళ్లి వస్తున్న మంచు లక్ష్మీకి అక్కడ ఉండేందుకు ఇబ్బంది అవుతున్నట్లు ఉంది. బహుశా అందుకే ఈ ఫ్లాట్ ని తీసుకున్నట్లు తెలస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్, ప్రభాస్, సూర్య లాంటి హీరోలకు ముంబైలో ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో మంచు లక్ష్మీ కూడా చేరిందనమాట.

(ఇదీ చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement