ఇప్పుడంతా యూట్యూబ్ ట్రెండ్ నడుస్తుంది. కామన్ పీపుల్ దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు ఇప్పుడు చాలామంది యూట్యూబ్‌లోకి వచ్చేస్తున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మీ, కీర్తి సురేష్ వంటి స్టార్స్ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ రాశీ ఖన్నా సైతం యూట్యూబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాశీ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
తాజాగా తాను యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరిన్ని విషయాలు పంచుకుంటానని వివరించింది. ఈ సందర్భంగా రాశీ మాట్లాడుతూ.. తాను చాలా రొమాంటిక్ పర్సన్ అని, తనకు డిన్నర్ డేటింగ్స్, లవ్ లెటర్స్ అంటే చాలా ఇష్టమని పేర్కొంది.
ఇక తన జీవితంలో వారానికి 20ఫ్లయిట్ జర్నీలు చేస్తానని, త్వరలోనే షూటింగ్‌లో బిహైండ్ ది సీన్స్‌ని కూడా చూపిస్తానంది. స్కిన్ కేర్, జిమ్ సహా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంటానని అందుకోసం తన ఛానెల్‌ను లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment