
అమ్మ లేకపోతే గమనం లేదు.. అమ్మ లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు.. అసలు అమ్మ లేకపోతే ఈ సృష్టే లేదు అంటుంటారు. అలాంటి అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆమె చూపించే ప్రేమకు దాసోహమవడం తప్ప! ఈరోజు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా తన తల్లికి లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చింది. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ ఆదివారం నాడు అమ్మ దగ్గరికి వెళ్లిన ఆమె బీఎమ్‌డబ్ల్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. దీని ధర దాదాపు రూ.1.40 కోట్లని తెలుస్తోంది. ఎప్పటికైనా ఓ లగ్జరీ కారు సొంతం చేసుకోవాలన్న తల్లి కలను రాశీ ఎట్టకేలకు నెరవేర్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
కాగా రాశీ ఖన్నా యోధ సినిమాతో త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది. సిద్దార్థ్ మల్హోత్రా, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన యోధ ఈ ఏడాది నవంబర్ 11న రిలీజ్ కానుంది. ఫర్జి అనే ప్రాజెక్ట్‌తో త్వరలోనే ఓటీటీలోనూ ఎంట్రీ ఇవ్వనుందీ బ్యూటీ.
చదవండి: హీరోయిన్‌తో టాలీవుడ్ హీరో పెళ్లికి ముహూర్తం ఫిక్స్!
నా కూతురితో కారులో ఉన్నాను.. అత్యాచారం చేస్తానని బెదిరించాడు
Comments
Please login to add a commentAdd a comment