మద్రాస్ కేఫ్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ రాశీ ఖన్నా. తర్వాత ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అది హిట్ కావడంతో వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ ఇక్కడే సెటిలైపోయింది. సుమారు 9 ఏళ్ల తర్వాత రుద్ర వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులను పలకరించిందీ ముద్దుగుమ్మ. అయితే కెరీర్ తొలినాళ్లలో బొద్దుగుమ్మగా ఉండే రాశీని దక్షిణాది చిత్రపరిశ్రమవాళ్లు వెక్కిరించేవారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది హీరోయిన్.
'సౌత్‌లో హీరోయిన్‌గా అడుగులు వేస్తున్న సమయంలో నన్ను గ్యాస్ టాంకర్ అంటూ రకరకాల పదాలతో వెక్కిరించేవారు. నేను కొద్దిగా లావుగా ఉండేదాన్ని కాబట్టి నేనేమీ అనకపోయేదాన్ని. కథానాయికగా నేను సన్నగా ఉండాలని తెలుసుకున్నాక బరువు తగ్గాను. అంతేతప్ప ఎవరో అన్నారని నేను సన్నబడలేదు. సోషల్ మీడియాలో కూడా నామీద వ్యతిరేక కామెంట్లు చేసినా నేను పెద్దగా పట్టించుకోకపోయేదాన్ని కాదు. నాకు పీసీఓడీ సమస్య ఉందన్న విషయం తెలియకుండా ఏదేదో అనేవాళ్లు. మొదట్లో బాధగా అనిపించేది కానీ ఇప్పుడు లైట్ తీసుకుంటున్నానని' చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా.
Comments
Please login to add a commentAdd a comment