ప్రస్తుతం టాలీవుడ్‌లో సింగర్ సిద్ శ్రీరామ్ హవా కొనసాగుతోంది. ఆయన పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అవుతుండటంతో సిద్ శ్రీరామ్‌తో ఒక్క పాటైనా పాడించాలని సంగీత దర్శకులూ కోరుకుంటున్నారు. యూత్‌లోనూ ఈ యంగ్ సింగర్‌కు మంచి క్రేజ్ ఉంది. దీంతో సిద్ శ్రీరామ్ పాట లేనిదే ఈ మధ్య సినిమాలు రిలీజ్ కావట్లేదనడంలో అతిశయోక్తి లేదు. సినిమా ఫలితాల సంగతి ఎలా ఉన్నా సిద్ శ్రీరామ్‌తో పాడించిన పాటలు మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి.
కొన్నిసార్లు అయితే సిద్ శ్రీరామ్ పాడిన పాటలతోనే సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది. అదే కోవలోకి వస్తుంది.. శశి చిత్రంలోని ఒకే ఒక లోకం నువ్వు పాట. ఆది సాయికుమార్, సురభి నటించిన ఈ చిత్రం బాక్స్‌ఫీస్ వద్ద బోల్తా కొట్టినా ఈ పాట మాత్రం సూపర్ హిట్ అయ్యింది. సిద్ శ్రీరామ్ పాడిన 'ఒకే ఒక లోకం నువ్వు' పాట సినిమా విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌ను సంపాదించుకొని మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించగా, అరుణ్ చివులూరు సంగీతం అందించారు.
చదవండి : సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment